vaccination: టీకా ఐచ్ఛికమే.. కానీ ఇక్కడ కాదు

కొవిడ్‌ కట్టడిలో వ్యాక్సినేషన్‌ ప్రధాన పాత్ర పోషిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రక్రియను ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో.. టీకా వేయించుకునేందుకు నిరాకరించిన, భారత ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఓ అధికారిని కేంద్ర ప్రభుత్వం సర్వీసు నుంచి తొలగించింది.

Published : 13 Aug 2021 01:27 IST

వ్యాక్సిన్‌కు నిరాకరించిన ఎయిర్‌ఫోర్స్‌ ఉద్యోగి తొలగింపు

అహ్మదాబాద్‌: కొవిడ్‌ కట్టడిలో వ్యాక్సినేషన్‌ ప్రధాన పాత్ర పోషిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రక్రియను ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో.. టీకా వేయించుకునేందుకు నిరాకరించిన, భారత ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఓ అధికారిని కేంద్ర ప్రభుత్వం సర్వీసు నుంచి తొలగించింది. వాయుసేనలో దేశవ్యాప్తంగా తొమ్మిది మంది సిబ్బంది టీకా తీసుకోలేదు.  ఈ విషయమై వివరణ కోరుతూ కేంద్రం వారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ ఎయిర్‌ఫోర్స్‌ కార్పొరల్ యోగేంద్ర కుమార్ గుజరాత్ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ ఏజే దేశాయ్‌, జస్టిస్‌ ఏపీ థాకర్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎయిర్‌ ఫోర్స్‌ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ దేవాంగ్ వ్యాస్ వాదనలు వినిపిస్తూ.. ‘టీకాకు నిరాకరించిన వారికి తొలుత షోకాజ్‌ నోటీసులు జారీ చేశాం. స్పందించని ఓ ఎయిర్‌మెన్‌ను సర్వీస్ నుంచి తొలగించిన’ట్లు తెలిపారు.  టీకా వేయించుకోవడం అనేది ఐచ్ఛికమైనా..  వైమానిక దళానికి సంబంధించినంత వరకూ దీన్ని తప్పనిసరి చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే, ఈ చర్య ఎవరిపై తీసుకున్నారో వివరాలు ఇవ్వలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు