Air Pollution: చెడుగాలి.. మనసునూ చెరుస్తుంది

గాలి కాలుష్యం ఊపిరితిత్తుల సమస్యల దగ్గర్నుంచి క్యాన్సర్ల వరకూ రకరకాల జబ్బులు తెచ్చిపెడుతుందన్నది తెలిసిందే. ఇది ఒక్క శరీరంతోనే ఆగటం లేదు.

Published : 10 Feb 2022 17:51 IST

గాలి కాలుష్యం ఊపిరితిత్తుల సమస్యల దగ్గర్నుంచి క్యాన్సర్ల వరకూ రకరకాల జబ్బులు తెచ్చిపెడుతుందన్నది తెలిసిందే. ఇది ఒక్క శరీరంతోనే ఆగటం లేదు. మానసిక సమస్యలనూ తెచ్చిపెడుతంది! వాయు కాలుష్యంతో కుంగుబాటు, ఆత్మహత్యల ముప్పు పెరుగుతున్నట్టు తేలటమే దీనికి నిదర్శనం. సగటున ఏడాది కాలంలో గాలిలో నుసి పదార్థం.. అంటే పీఎం2.5 (పార్టిక్యులేటర్‌ మ్యాటర్‌) 10 మైక్రోగ్రాముల కన్నా మించకూడదన్నది ప్రపంచ ఆరోగ్యసంస్థ సిఫారసు. దీని కన్నా రెట్టింపు కాలుష్యం గల ప్రాంతాల్లో కనీసం ఆరు నెలల పాటు నివసించినవారికి కుంగుబాటు ముప్పు 10% వరకు పెరుగుతున్నట్టు యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ పరిశోధకులు గుర్తించారు. అదే కాస్త పెద్ద కాలుష్య రేణువుల (పీఎం10) ప్రభావానికి గురైతే ఆత్మహత్య ముప్పు 2% పెరుగుతుండటం గమనార్హం. నుసి పదార్థం రక్తంలోకి, అక్కడ్నుంచి మెదడులోకి చేరుకోవటం దీనికి కారణం కావొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఎందుకంటే కాలుష్య కారకాలు మెదడులో వాపు ప్రక్రియను ప్రేరేపించటంతో పాటు ఒత్తిడి హార్మోన్లనూ ప్రభావితం చేస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని