Published : 21/02/2021 01:14 IST

గన్నవరంలో విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టిన విమానం!

గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో ఎయిరిండియా అంతర్జాతీయ విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. దోహా నుంచి గన్నవరానికి వస్తున్న ఈ విమానం ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో విమానం రెక్కలు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదం సమయంలో విమానంలో 64మంది ప్రయాణికులు ఉన్నట్టు ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ తెలిపారు. అయితే, ప్రయాణికులంతా సురక్షితంగానే బయటపడటంతో ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ల్యాండింగ్‌ సమయంలో ఒరిగిపోయిన విద్యుత్‌ స్తంభాన్ని తాకిందా? లేదంటే ఎలా జరిగిందనే దానిపై విచారిస్తున్నారు.


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని