Viral video: అటు పతకం గెల్చి.. ఇటు ప్రేమను పొంది..
టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించి తిరిగి వచ్చిన ఏ క్రీడాకారిణికి ఇంతకు మించిన ఆహ్వానం లభించి ఉండకపోవచ్చు! కెనడాకు చెందిన ఓ డైవర్ అలా ఊహించని అనుభవం ఎదుర్కొంది. స్వదేశానికి చేరుకున్న వెంటనే ఎయిర్‌పోర్ట్‌లో తన స్నేహితుడి నుంచి రొమాంటిక్ ప్రపోజల్‌ను అందుకుంది.
డైవింగ్‌లో రజతం గెల్చిన కెనడా క్రీడాకారిణికి అపురూప అనుభవం
ఒట్టావా: టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించి తిరిగి వచ్చిన ఏ క్రీడాకారిణికి ఇంతకు మించిన ఆహ్వానం లభించి ఉండకపోవచ్చు! కెనడాకు చెందిన ఓ డైవర్ అలా ఊహించని అనుభవం ఎదుర్కొంది. స్వదేశానికి చేరుకున్న వెంటనే ఎయిర్‌పోర్ట్‌లో తన స్నేహితుడి నుంచి రొమాంటిక్ ప్రపోజల్‌ను అందుకుంది.
జెన్నిఫర్ అబెల్ టోక్యో ఒలింపిక్స్‌లో డైవింగ్‌లో రజత పతకాన్ని సాధించింది. తన సహచరులతో కలసి సోమవారం స్వదేశం కెనడాకు చేరుకుంది. విమానాశ్రయంలో ఆమెకు ఆహ్వానం పలికిన ఆమె స్నేహితుడు.. ఇదే మంచి సందర్భంగా భావించి తన ఇష్టసఖికి ప్రేమను వెల్లడించాడు. మోకాళ్లపై వంగి, డైమండ్ రింగ్‌ను తొడిగి రొమాంటిక్‌గా తన ప్రేమను వ్యక్తపరిచాడు. దాంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన జెన్నిఫర్.. ఆనందంతో ఉప్పొంగిపోయింది. తన కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో తన ప్రేమను అంగీకరించింది. మొదట ఈ వీడియో టీమ్ కెనడా ఖాతాలో షేర్ కాగా, దాన్ని ఒలింపిక్స్ ట్విటర్ ఖాతా రీట్వీట్ చేసింది. ‘ఒలింపిక్ పతకం నుంచి డైమండ్ రింగ్ వరకు.. జెన్నిఫర్ వేడుక జరుపుకోవడానికి చాలా విషయాలున్నాయి’ అంటూ టీమ్ కెనడా రాసుకొచ్చింది. ఇప్పుడీ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువయ్యేలా మార్పులు రావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆకాంక్షించారు. -
ఏపీలో పింఛన్ల పంపిణీ.. వాలంటీర్లకు కీలక ఆదేశాలు
ఏప్రిల్, మే నెల పింఛన్ల పంపిణీకి వాలంటీర్లు ఆథరైజేషన్ పత్రాలు తీసుకోవాలని గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ (సెర్ప్) సర్క్యులర్ జారీ చేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ప్రజలు ఉదాసీనంగా ఉన్నంత కాలం నిబంధనలు అమలు కావు: జస్టిస్ చలమేశ్వర్
ప్రజలు ఉదాసీనంగా ఉన్నంత కాలం ఎన్ని నిబంధనలు ఉన్నా అమలు కావని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. -
ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
నేడు నగరంలోని ఉప్పల్ స్టేడియంలో ముంబయి-హైదరాబాద్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రామ్‌చరణ్ దంపతులు
తిరుమల శ్రీవారిని సినీనటుడు రామ్‌చరణ్, ఉపాసన దంపతులు దర్శించుకున్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మావయ్యా.. ఇదేం ప్రగతయ్యా..?
నాడు-నేడు అంటూ విద్యా వ్యవస్థలో, మౌలిక సదుపాయాల కల్పనలో ఎన్నో సమూల మార్పులు తెచ్చామని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా.. నేటికీ పలు చోట్ల ఆ ప్రగతి కనిపించడం లేదు. -
డబ్బులు ఇస్తారా.. స్టేషన్‌కు వస్తారా..!
కొంతమంది పోలీసులు అధికారుల ఆదేశాలను అడ్డుగా పెట్టుకుని వసూళ్లకు పాల్పడుతున్నారు. తాము నిబంధనలు ఉల్లంఘించలేదని తమను వదిలిపెట్టాలని బాధితులు వేడుకుంటున్నా వారు వినిపించుకోకుండా తమదైన ముద్ర చూపుతున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.. -
ప్రయాణికుల రద్దీ.. 32 ప్రత్యేక రైళ్ల సర్వీసులు పొడిగింపు
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఆ రైళ్ల వివరాలివే..
తాజా వార్తలు (Latest News)
-
ఆరోగ్యకరమైన జీవితానికి మూడు సూత్రాలు.. డాక్టర్ ఫార్ములా షేర్ చేసిన హర్ష గోయెంకా
-
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
-
26/11 హీరో సదానంద్ వసంత్ దాటేకు ఎన్ఐఏ పగ్గాలు
-
కాంగ్రెస్ ఎనిమిదో జాబితా.. తెలంగాణలో మరో నాలుగు స్థానాలకు అభ్యర్థుల ప్రకటన
-
కాంగ్రెస్‌లో చేరిన భారాస నేతలు, కార్యకర్తలు
-
నవనీత్ రాణాకు భాజపా టికెట్ .. ఆ సీటు నుంచే బరిలోకి..