#AirtelDown: ఎయిర్‌టెల్‌ సేవలకు అంతరాయం.. సోషల్‌ మీడియాలో యూజర్ల ఫిర్యాదు

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ (Airtel) సేవలకు అంతరాయం ఏర్పడింది. బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి పలువురు ఎయిర్‌టెల్‌ యూజర్లు సోషల్‌మీడియాలో ఫిర్యాదు చేస్తున్నారు.

Updated : 08 Jun 2022 18:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ (Airtel) సేవలకు అంతరాయం ఏర్పడింది. బుధవారం సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య దాదాపు గంట పాటు ఆ కంపెనీ సేవలు నిలిచిపోయాయి. దీనిపై పలువురు ఎయిర్‌టెల్‌ యూజర్లు సోషల్‌ మీడియాలో ఫిర్యాదు చేశారు. ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌ సిగ్నల్‌ రావడం లేదని, ఇంటర్నెట్‌ యాక్సెస్‌ చేయలేకపోతున్నామంటూ #AirtelDown హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్లు చేశారు. దాదాపు గంట తర్వాత సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి.

డౌన్‌ ట్రాకర్‌ వెబ్‌సైట్‌ ప్రకారం.. సాయంత్రం 4 నుంచి ఈ సమస్య మొదలైనట్లు తెలుస్తోంది. ఎయిర్‌టెల్‌ టెలికాం సేవలతో పాటు ఎయిర్‌టెల్‌ బ్రాడ్‌బ్యాండ్‌, ఎయిర్‌టెల్‌ డీటీహెచ్‌ సేవల్లో సైతం ఈ లోపం తలెత్తినట్లు సమాచారం. కొందరికి మొబైల్‌లో సిగ్నల్‌ వస్తున్నప్పటికీ మెసేజులు వెళ్లడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఫిర్యాదు చేశారు. ఏపీ, తెలంగాణ సహా కర్ణాటక, కేరళ, తమిళనాడు, దిల్లీకి చెందిన యూజర్లు కూడా దీనిపై ఫిర్యాదులు చేశారు. సాయంత్రం 5 గంటల తర్వాత క్రమంగా ఫిర్యాదుల సంఖ్య తగ్గింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని