
ఆ కథనాలు అవాస్తవం: ఏకే సింఘాల్
అమరావతి: ఏపీలో ఆక్సిజన్ కొరత లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఏకే సింఘాల్ స్పష్టంచేశారు. మ్యుటెంట్ విస్తరణ కథనాలు అవాస్తవమని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో అబద్ధాలు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రమాదకరమైన మ్యుటెంట్ విస్తరణ పేరుతో వస్తున్న కథనాల్లో వాస్తవంలేదన్నారు. స్ట్రెయిన్‌పై సీసీఎంబీ అధికారికంగా ప్రకటించలేదని సింఘాల్ చెప్పారు. కొవిడ్ రెండో దశలో ఎక్కువ మరణాలు వాస్తవమేనన్న ఆయన.. కొత్తగా స్ట్రెయిన్ వల్లే మరణాలు అనేది సరికాదన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.