Telangana News: మందుబాబులకు షాక్‌.. తెలంగాణలో పెరిగిన మద్యం ధరలు!

తెలంగాణలో మద్యం ధరలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన మద్యం ధరలు ఈ నెల 19 నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు

Updated : 18 May 2022 22:17 IST

హైదరాబాద్‌: మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన మద్యం ధరలు ఈ నెల 19 నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మద్యం దుకాణాల్లో ఇవాళ్టి అమ్మకాలు పూర్తి కాగానే మద్యం సీజ్‌ చేయనున్న అధికారులు.. నిల్వలు లెక్కించి రేపటినుంచి పెరిగిన ధరల ప్రకారం విక్రయించేలా చర్యలు తీసుకోనున్నట్లు అబ్కారీ శాఖ వెల్లడించింది. అబ్కారీ శాఖ అధికారులు కార్యాలయాల్లోనే ఉండాలని ఆ శాఖ ఆదేశించింది. పెరిగిన మద్యం ధరలకు సంబంధించిన సమాచారాన్ని మద్యం దుకాణదారులకు సైతం అబ్కారీ శాఖ తెలియజేసింది. కనీసం 10 శాతం పెంపు ఉంటుందని దుకాణదారులు అంచనా వేస్తున్నారు. అయితే ఎంత మేర ధరలు పెరిగాయనే వివరాలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని