Updated : 27/06/2021 17:36 IST

KCR: ఎస్సీల అభివృద్ధికి దశల వారీ కార్యాచరణ

సీఎం కేసీఆర్ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ

హైదరాబాద్‌: ఎస్సీ సాధికారతపై సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఎస్సీ ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలో కేసీఆర్‌ సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న సీఎం దళిత సాధికారత పథకం విధివిధానాలపై ఈ భేటీలో చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ నుంచి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీపీఎం నుంచి తమ్మినేని వీరభద్రం, సీపీఐ నుంచి చాడ వెంకట్‌రెడ్డి, మజ్లిస్‌ తరఫున బలాలా, పాషా ఖాద్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధిలో ప్రభుత్వాలదే కీలకపాత్రని చెప్పారు. ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తే రేపటి తరాలు నష్టపోతాయన్నారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీల బాధలు పోవాలని.. వారి అభివృద్ధి కోసం దశలవారీ కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఎస్సీల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ఏం చేయాలో సూచించాలని అఖిలపక్ష నేతలను సీఎం కోరారు.

‘‘భూమి ఉత్పత్తి సాధనంగా ఇన్నాళ్లూ జీవనోపాధి సాగింది. ఎస్సీ యువత స్వయం ఉపాధి పొందేలా చూడాలి. పారిశ్రామిక, సాంకేతిక రంగాల్లో స్వయం ఉపాధి పొందాలి. గ్రామీణ, పట్టణ ఎస్సీల సమస్యలు గుర్తించి పరిష్కారం చూపాలి. దళిత సాధికారత పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తాం. అర్హులకు నేరుగా ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటాం. పారదర్శకంగా దళారీలు లేని విధానానికి సలహాలు ఇవ్వాలి. ఈ పథకానికి ఎస్సీల్లో అర్హులైన కుటుంబాల గణన జరపాలి. ఎస్సీ సాధికారతకు బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తాం. అవసరమైతే మరో రూ.500 కోట్లు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మూడు, నాలుగేళ్లలో రూ.35 వేల కోట్ల నుంచి రూ.45 వేల కోట్ల వరకు ఖర్చు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ బడ్జెట్‌ ఎస్సీ ఉపప్రణాళికలకు అదనం. ఎస్సీ సాధికారత సాధనకు ప్రణాళికాబద్ధంగా పని చేస్తాం. అఖిలపక్ష నేతలంగా కలిసి రావాలి. ఎస్సీ సాధికారత పథకాన్ని సంపూర్ణంగా విజయవంతం చేయాలి’’ అని సీఎం తెలిపారు.

ఈ మేరకు ఎస్సీలకు ఉన్న భూమి గణన చేపట్టాలని.. లెక్కలు స్థిరీకరించి సమగ్ర నివేదికను అందజేయాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. 15 రోజులు ఎస్సీల భూముల గణన మీదే యంత్రాంగం దృష్టి సారించాలని చెప్పారు. ఇందుకోసం చేపట్టాల్సిన కార్యాచరణను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని