‘‘కరోనా చికిత్సల కోసం రూ. 350 కోట్లు ఖర్చవుతోంది’’

కరోనా కేంద్రాల్లో భోజనం, పారిశుద్ధ్యంపై ఆరోపణలు చేస్తున్నారని.. అలాంటి ఆరోపణలు వైద్యుల మనోధైర్యం దెబ్బతేసే చర్యలని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. రాష్ట్రంలో కరోనా చికిత్సలపై వస్తున్న ఆరోపణలు, ప్రస్తుత పరిస్థితులపై ఆయన మీడియాతో  మాట్లాడారు. ‘‘కరోనా చికిత్సల కోసం రూ. 350 కోట్లు

Published : 28 Jul 2020 01:44 IST

ఏపీ మంత్రి ఆళ్ల నాని

అమరావతి: కరోనా కేంద్రాల్లో భోజనం, పారిశుద్ధ్యంపై ఆరోపణలు చేస్తున్నారని.. అలాంటి ఆరోపణలు వైద్యుల మనోధైర్యం దెబ్బతేసే చర్యలని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. రాష్ట్రంలో కరోనా చికిత్సలపై వస్తున్న ఆరోపణలు, ప్రస్తుత పరిస్థితులపై ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా చికిత్సల కోసం రూ. 350 కోట్లు ఖర్చవుతోందన్నారు. కోలుకున్న వారి నుంచి ప్లాస్మా సేకరణకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. కరోనాతో మృతి చెందిన వారి దహన సంస్కారాలను ఎవరూ అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. చికిత్సకు అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉంచామని, గత 6 నెలలుగా 17వేల మంది నిపుణులను నియమించామని మంత్రి నాని పేర్కొన్నారు. కరోనా పరీక్షల కోసం 20 ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్సకు నిరాకరించినా, అధిక ధరలు వసూలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని