Andhra News: ఏపీ సీఎంవోలో ఐఏఎస్ అధికారులకు శాఖల కేటాయింపు
ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులకు శాఖలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే సీఎంవోలో మార్పులు చేర్పులు చోటు చేసుకోవడంతో ముఖ్యమంత్రికి నివేదించేందుకు వివిధ శాఖలను అధికారులకు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
అమరావతి: ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులకు శాఖలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే సీఎంవోలో మార్పులు చేర్పులు చోటు చేసుకోవడంతో ముఖ్యమంత్రికి నివేదించేందుకు వివిధ శాఖలను అధికారులకు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. సీఎంవో నుంచి ఒకరు సీఎస్‌గా, మరొకరు కేంద్ర సర్వీసులకు వెళ్లటంతో శాఖలు మార్పు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.
ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమితులైన పూనం మాలకొండయ్యకు సాధారణ పరిపాలన శాఖతో పాటు విద్య, వైద్యారోగ్యం, వ్యవసాయం, పరిశ్రమలతో పాటు మొత్తం 10శాఖలకు చెందిన అంశాలను కేటాయించారు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు కూడా ఆమె పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. సీఎం కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డికి ఆర్థిక, హోం, జలవనరులశాఖలు సహా 7 అంశాలను పర్యవేక్షిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీఎంవోలో అదనపు కార్యదర్శి రేవు ముత్యాలరాజు రెవెన్యూ, రవాణా, పర్యాటక తదితర అంశాలను పర్యవేక్షించనున్నారు. జాయింట్ సెక్రటరీ హోదాలో ఉన్న నారాయణ భరత్ గుప్తా పంచాయితీరాజ్, సచివాలయాలు, ఐటీ, గృహనిర్మాణం తదితర అంశాలను పర్యవేక్షిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
పరీక్షా హాలులో అమ్మాయిలను చూసి.. స్పృహ తప్పిపడిపోయిన ఇంటర్ విద్యార్థి
-
Ap-top-news News
Gudivada Amarnath: త్వరలో విశాఖ భవిష్యత్తు మారుతుంది: మంత్రి అమర్నాథ్
-
Ap-top-news News
Taraka Ratna: మెదడు సంబంధిత సమస్య మినహా తారకరత్న క్షేమం: విజయసాయిరెడ్డి
-
India News
బడ్జెట్ అంశాలు లీకవడంతో.. పదవిని కోల్పోయిన ఆర్థిక మంత్రి
-
Sports News
Hanuma Vihari: విహారి ఒంటి చేత్తో.. మణికట్టు విరిగినా బ్యాటింగ్
-
Ts-top-news News
Samathamurthy: నేటి నుంచి సమతా కుంభ్ బ్రహ్మోత్సవాలు