Alpha Covid Variant: అమ్మో! మూగ జీవాలను వదలని కరోనా ఆల్ఫా వేరియంట్‌

కరోనా వైరస్ కేవలం మనుషులనే కాకుండా మూగ జీవాలను పొట్టన పెట్టుకుంటోంది. తాజాగా కరోనా అల్ఫా వేరియంట్‌ సైతం కుక్కలు, పిల్లులు వంటి మూగజీవాలకు ప్రమాదకరంగా మారనున్నందా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది.

Published : 06 Nov 2021 02:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్ కేవలం మనుషులనే కాకుండా మూగ జీవాలకు సైతం సోకుతోంది. తాజాగా పెంపుడు జంతువుల్లో ఆల్ఫా వేరియంట్‌ కనుగొన్నట్లు లండన్‌ పరిశోధకులు నిర్ధారించారు. ‘వెటర్నరీ రికార్డ్ జర్నల్’లో ప్రచురితమైన ఓ అధ్యయనంలో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి. ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ ద్వారా రెండు పిల్లులు, ఓ కుక్కలో SARS-CoV-2 అల్ఫా వేరియంట్‌ను గుర్తించారు. వాటి గుండెపై తీవ్ర ప్రభావం కనిపించిదని పరిశోధకులు పేర్కొన్నారు.

ఈ పెంపుడు జంతువులకు కరోనా సోకడానికి కొన్ని వారాల మందు వాటి యజమానులకు కరోనా సోకినట్లు పరిశోధనల్లో తేలింది. గతంలో జంతువుల్లో గుర్తించిన వైరస్‌ కంటే ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన వేరియంట్‌ చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. అత్యధిక శాతం జంతువులు మనుషులతో సన్నిహితంగా ఉండడం వల్లే వైరస్‌ సోకినట్లు నిపుణులు గుర్తించారు. జంతువుల్లో కరోనా సోకడం అనేది అరుదుగా ఉంటుందని, జంతువుల నుంచి మనుషులకు వైరస్‌ సోకే అవకాశాల కంటే మనుషుల నుంచి జంతువులకు వైరస్‌ సంక్రమణకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని