Amaravati: నెరవేరిన ఆకాంక్షలు.. తిరుమలకు రాజధాని రైతుల పాదయాత్ర

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం, అమరావతి ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడంతో రాజధాని ప్రాంత రైతులు తిరుమలకు కృతజ్ఞత పాదయాత్ర ప్రారంభించారు.

Published : 24 Jun 2024 10:30 IST

అమరావతి: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం, అమరావతి ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడంతో రాజధాని ప్రాంత రైతులు తిరుమలకు కృతజ్ఞత పాదయాత్ర ప్రారంభించారు. రాజధాని పరిధిలోని వెంకటపాలెంలో ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి తిరుమలకు మహిళలు, రైతులు పాదయాత్ర చేపట్టారు. అమరావతి పనులు ప్రారంభమైతే తిరుమల తిరుపతి దేవస్థానం వరకు పాదయాత్రగా వస్తామని ఉద్యమ సమయంలో రైతులు మొక్కుకున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం మొదలుపెట్టిన పాదయాత్రను తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ ప్రారంభించారు. 20 రోజుల పాటు ఇది కొనసాగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని