Amaravati: ఇంద్రకీలాద్రికి అమరావతి రైతుల పాదయాత్ర

రాజధాని ప్రాంత రైతులు విజయవాడ ఇంద్రకీలాద్రికి పాదయాత్ర చేపట్టారు. అమరావతి రూపశిల్పి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో పాటు రాజధాని ఉద్యమం విజయం సాధించడంతో కనకదుర్గమ్మ ఆలయానికి అమరావతి ఐకాస ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభించారు.

Updated : 23 Jun 2024 12:09 IST

తుళ్లూరు: రాజధాని ప్రాంత రైతులు విజయవాడ ఇంద్రకీలాద్రికి పాదయాత్ర చేపట్టారు. అమరావతి రూపశిల్పి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో పాటు రాజధాని ఉద్యమం విజయం సాధించడంతో కనకదుర్గమ్మ ఆలయానికి అమరావతి ఐకాస ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభించారు. ఆదివారం తెల్లవారుజామున తుళ్లూరు శిబిరం నుంచి రైతులు, మహిళలు పొంగళ్లు తయారు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం ఇంద్రకీలాద్రికి కాలి నడకన బయల్దేరారు. ఉదయం 11 గంటలలోపు అక్కడికి చేరుకుని మొక్కులు చెల్లించుకునేలా ప్రణాళిక రూపొందించారు. తుళ్లూరు నుంచి రాయపూడి, రాజధాని సీడ్‌ యాక్సెస్‌ రహదారి, కరకట్ట, ప్రకాశం బ్యారేజీ మీదుగా పాదయాత్ర సాగనుంది.  పెద్ద సంఖ్యలో రైతులు, మహిళలు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని