RamojiRao: అమరావతి ఐకాస క్యాండిల్‌ ర్యాలీ.. రామోజీరావుకు ఘన నివాళి

రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావుకు రాజధాని అమరావతి ఐకాస ఘనంగా నివాళులర్పించింది.

Updated : 19 Jun 2024 20:48 IST

తుళ్లూరు: రామోజీ గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావుకు రాజధాని అమరావతి ఐకాస ఘనంగా నివాళులర్పించింది. ఐకాస ఆధ్వర్యంలో తుళ్లూరులో రైతులు క్యాండిల్‌ ర్యాలీ నిర్వహించారు. రాజధానికి అమరావతి అని పేరు పెట్టింది రామోజీరావు అని, రైతుల ఉద్యమానికి ఆయన అండగా నిలిచారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అమరావతి ఉన్నంతకాలం ఆ మహనీయుని జ్ఞాపకాలను తెలుగు వారు స్మరించుకుంటారని ఐకాస ఛైర్మన్‌ శివారెడ్డి అన్నారు. రామోజీరావు కార్యదక్షత, పట్టుదల భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అక్షర యోధునికి అమరావతి అశ్రు నివాళులర్పిస్తోందని ఐకాస నేత సుధాకర్‌ అన్నారు. అమరావతి ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపజేసిన గొప్ప వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, రాజధాని పరిధిలోని వివిధ గ్రామాల రైతులు, మహిళలు ర్యాలీలో పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని