Amaravati: నాగార్జున వర్సిటీ వద్ద అమరావతి రైతుల ఆందోళన.. ఉద్రిక్తత

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. గతంలో 3 రాజధానులకు అనుకూలంగా సమావేశం నిర్వహించిన వీసీ రాజశేఖర్‌ రాజీనామాకు అమరావతి ప్రాంత రైతులు డిమాండ్‌ చేశారు.

Updated : 19 Jun 2024 13:48 IST

గుంటూరు (ఏఎన్‌యూ): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ) వద్ద ఉద్రిక్తత నెలకొంది. గతంలో 3 రాజధానులకు అనుకూలంగా సమావేశం నిర్వహించిన వీసీ రాజశేఖర్‌ రాజీనామాకు అమరావతి ప్రాంత రైతులు డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో బుధవారం వర్సిటీ వద్ద ఆందోళనకు దిగారు. గేట్లు నెట్టుకుంటూ లోపలికి వెళ్లారు.  రాజధాని రైతులను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుని పక్కకు నెట్టేశారు. వీసీ కార్యాలయానికి తాళం వేశారు. దీంతో రైతులు అక్కడే బైఠాయించారు. వీసీ పోస్టు నుంచి రాజశేఖర్‌ తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. రాజధాని రైతుల ఆందోళన నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని