
Published : 16 Jan 2022 22:39 IST
Ap News: వెలగపూడిలో రాజధాని రైతుల కాగడాల ప్రదర్శన
వెలగపూడి: అమరావతి-సంక్రాంతి నిరసనలో భాగంగా ఆదివారం రాత్రి వెలగపూడిలో రాజధాని రైతులు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. వెలగపూడి దీక్షా శిబిరం నుంచి జేఏసీ కార్యాలయం వరకు ‘అమరావతి వెలుగు’ పేరుతో మహిళలు, రైతులు రహదారి వెంట కాగడాలు, కొవ్వొత్తులు చేతబట్టి నిరసన తెలిపారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదంటూ నినాదాలు చేశారు. తెదేపా నేతలు టి.శ్రావణ్ కుమార్, గద్దె అనురాధ, సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఐకాస నేత పువ్వాడ సుధాకర్ తదితరులు ఆందోళనలో పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు.
Tags :