
Andhra News: మూడు రాజధానుల ముచ్చట ఎంతోకాలం సాగదు: శివారెడ్డి
అమరావతి: అభివృద్ధి చేయడ చేతకాక.. ప్రజల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకొనేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ శివారెడ్డి విమర్శించారు. రాజధాని అంశంలో రాష్ట్ర హైకోర్టు విస్పష్ట తీర్పు ఇచ్చినా మూడు రాజధానులకే తాము కట్టుబడి ఉన్నామంటూ సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించడంపై ఆయన మండిపడ్డారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో పరిరక్షణ సమితి నేతలతో కలిసి శివారెడ్డి మాట్లాడారు.
ఇప్పటికీ మూడు రాజధానులే తమ విధానమని జగన్ చెప్పడం పద్ధతి కాదని శివారెడ్డి అన్నారు. ఇకనైనా సీఎం తీరు మార్చుకోకుండా మొండిగా వెళ్తే ప్రజాక్షేత్రంలో పరాభవం తప్పదన్నారు. అమరావతి, రాష్ట్రం అభివృద్ధి చెందేవరకు తమ పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. మూడేళ్లయినా ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా పూర్తిచేయలేదని..ఏ పరిశ్రమనూ తీసుకురాలేదని ఆక్షేపించారు. అలాంటి జగన్ ప్రభుత్వం మూడు రాజధానులంటూ ప్రజల్ని ఇంకా మభ్యపెట్టే ప్రయత్న చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడురాజధానుల ముచ్చట ఇక ఎంతో కాలం సాగదని.. ప్రజాతీర్పు స్పష్టంగా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాబోతోందన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
VL-SRSAM: నౌకా దళానికి మరింత భరోసా.. స్వల్పశ్రేణి క్షిపణి ప్రయోగం విజయవంతం
-
General News
Triglycerides: ట్రైగ్లిజరైడ్ కొవ్వును కరిగించేదెలా అని చింతించొద్దు
-
India News
NITI Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈఓగా పరమేశ్వరన్ అయ్యర్
-
India News
Covid Endemic: కరోనా మహమ్మారి ఎండెమిక్ దశకు వచ్చినట్లేనా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే
-
General News
Telangana News: ఆర్పీఎఫ్ కాల్పుల్లో మృతి చెందిన రాకేశ్ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం
-
India News
Agnipath: అగ్నిపథ్‌లో ఎన్సీసీ క్యాడెట్లకు బోనస్ పాయింట్లు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- Crime News: మిత్రుడి భార్యపై అత్యాచారం... తట్టుకోలేక దంపతుల ఆత్మహత్యాయత్నం
- Agnipath Protest: సికింద్రాబాద్ అల్లర్ల కేసు... గుట్టువీడిన సుబ్బారావు పాత్ర
- Aaditya Thackeray: అర్ధరాత్రి బయటకొచ్చిన ఆదిత్య ఠాక్రే.. తర్వాత ఏం జరిగిందంటే?
- Tollywood: ప్రముఖ నిర్మాత ఇంట పెళ్లి సందడి.. తరలివచ్చిన తారాలోకం
- Team India WarmUp Match: భరత్ ఒక్కడే నిలబడ్డాడు.. విఫలమైన టాప్ఆర్డర్
- Maharashtra Crisis: రెబల్ ఎమ్మెల్యేల కోసం 7 రోజులకు 70 రూమ్‌లు.. రోజుకు ఎంత ఖర్చో తెలుసా!
- Team India: టీమ్ఇండియా మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం
- Andhra News: అయ్యో పాపం.. బైక్‌పై వెళ్తుండగా అన్నదమ్ముల సజీవదహనం
- Shamshera: బాహుబలి, కేజీఎఫ్‌లను తలపించేలా ‘షంషేరా’ ట్రైలర్!