Amaravati: అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రాంతాల మధ్య చిచ్చు పెడతారా?

కన్నెర్ర జేస్తే 5 నిమిషాల్లో యాత్రలు ఆగిపోతాయని, చేతులు ముడుచుకొని కూర్చుంటే ఉత్తరాంధ్ర ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ 

Published : 26 Sep 2022 02:01 IST

మంత్రి బొత్స వ్యాఖ్యలపై మండిపడ్డ అమరావతి ఐకాసా

అమరావతి: కన్నెర్ర జేస్తే 5 నిమిషాల్లో యాత్రలు ఆగిపోతాయని, చేతులు ముడుచుకొని కూర్చుంటే ఉత్తరాంధ్ర ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై అమరావతి ఐకాసా నేతలు మండిపడ్డారు. అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేని పాలకులు విభేదాలు సృష్టించి తమ పబ్బం గడుపుకొంటున్నారని ధ్వజమెత్తారు. ఈ అసమర్థ ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

మరోవైపు రాజధాని రైతుల మహా పాదయాత్రకు పద్నాలుగో రోజూ జనం నీరాజనాలు పలికారు. దారిపొడవునా స్థానికులు, విద్యార్థులు వారితో కలిసి పాదం కదిపారు. మూడు రాజధానుల పేరిట నాటకాలాడుతున్న ముఖ్యమంత్రి ఆటలు కట్టిపెట్టి.. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు డిమాండ్‌ చేశారు.ఇవాళ పాదయాత్ర ఎన్టీఆర్‌ జిల్లా నుంచి పశ్చిమగోదావరి జిల్లాకు చేరింది. 

గుడివాడలో నిన్న ఉద్రిక్తతల మధ్య  జరిగిన యాత్ర..ఈ రోజు నాగవరప్పాడు నుంచి ప్రారంభమైంది. తేదేపా సీనియర్‌ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, రావి వెంకటేశ్వరరావు యాత్రలో పాల్గొన్నారు. స్థానికులు, విద్యార్థులు దారిపొడవునా రైతులకు ఘనస్వాగతం పలికారు. ‘జై అమరావతి’ నినాదాలతో మార్మోగించారు. ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జగన్నాథపురం, నందివాడ గ్రామాల ప్రజలు అమరావతి రైతుల స్వామివారి రథానికి గుమ్మడి కాయలు,కొబ్బరి కాయలు కొట్టి సాదరంగా ఆహ్వానించారు. రైతులతో అడుగులో అడుగువేసి సంఘీభావం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని