
Updated : 02 Oct 2020 13:36 IST
దిల్లీలో అమరావతి ఐకాస మౌన ప్రదర్శన
దిల్లీ: గాంధీజీ 151వ జయంతి సందర్భంగా అమరావతి ఐకాస నేతలు దిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద మహాత్ముడికి నివాళులర్పించి మౌన ప్రదర్శన నిర్వహించారు. రైతుల త్యాగాలతో ఏర్పడిన అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఐకాస నాయకులతో పాటు తెలుగుదేశం నేత వంగవీటి రాధాకృష్ణ మహాత్ముడికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐకాస కన్వీనర్ శివారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని కోసం 290 రోజులుగా గాంధేయ మార్గంలోనే నిరసన కొనసాగిస్తున్నట్టు చెప్పారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించేలా పాలకులకు మంచి బుద్దిని ప్రసాదించాలని మహాత్ముడిని వేడుకున్నట్టు తెలిపారు.
Tags :