Amaravati Maha Padayatra: దెందులూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న మహాపాదయాత్ర
అమరావతి పరిరక్షణకోసం రాజధాని ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన
దెందులూరు: అమరావతి పరిరక్షణకోసం రాజధాని ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర 15వ రోజుకు చేరుకుంది. ఆదివారం సాయంత్రం కృష్ణా జిల్లా నుంచి ఏలూరు జిల్లాలోకి ప్రవేశించింది. సోమవారం దెందులూరు నియోజకవర్గం కొనికి నుంచి రైతులు పాదయాత్ర ప్రారంభించారు.
రైతులకు సంఘీభావం తెలిపేందుకు ఏలూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, రామరాజు, మాజీ మంత్రి జవహర్, మాజీ ఎంపీ మాగంటి బాబు, జిల్లా కార్యాలయ కార్యదర్శి పాలి ప్రసాద్, జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ కొక్కిరిగడ్డ జయరాజు, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పలువురు నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా కేహెచ్ జవహర్, జయరాజు, వీరాంజనేయులు, డబ్బు వాయించి అక్కడ అందర్నీ ఉత్సాహపరిచారు. పలువురు జనసేన, వామపక్ష నేతలు కూడా పాదయాత్రలో పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు.
కొనికి నుంచి ప్రారంభమైన పాదయాత్ర కడిమికుంట, సకల కొత్తపల్లి, సత్యవోలు, నాయుడుగూడెం, పెదపాడు, సత్యనారాయణపురం, అందేఖాన్ చెరువు మీదుగా ఏలూరు మండలం కొత్తూరు వరకు మొత్తం 15 కి.మీ మేర సాగనుంది. మధ్యాహ్నం పెదపాడులో భోజనం విరామం తీసుకుంటారు. రాత్రికి వట్లూరు క్రాంతి కల్యాణ మండపంలో బస చేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు