Amaravati Maha Padayatra: ఉత్సాహంగా రాజధాని రైతుల మహాపాదయాత్ర

అమరావతి పరిరక్షణే లక్ష్యంగా రాజధాని ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర ఏలూరు జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది.

Updated : 30 Sep 2022 12:36 IST

దెందులూరు: అమరావతి పరిరక్షణే లక్ష్యంగా రాజధాని ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర ఏలూరు జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. 19వ రోజుకు చేరుకున్న పాదయాత్ర.. దెందులూరు నియోజకవర్గం పెరుగ్గూడెం నుంచి ప్రారంభమై ద్వారకా తిరుమల మండలం నక్క పంగిడిగూడెం వద్ద గోపాలపురం నియోజవర్గంలో ప్రవేశించింది. సూర్యచంద్ర రావుపేట, గొల్లగూడెం, తిమ్మాపురం మీదుగా సాయంత్రానికి ద్వారకా తిరుమల వరకు కొనసాగుతుంది. తిమ్మాపురంలో మధ్యాహ్నం 2 గంటలకు రైతులు భోజన విరామం తీసుకుంటారు. 

తెదేపా ఏలూరు జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మాజీ ఎంపీ మాగంటి బాబు, మాజీ మంత్రులు పీతల సుజాత, కేఎస్‌ జవహర్‌, మాజీ ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, ముక్కిడి వెంకటేశ్వరరావు, జిల్లా పరిషత్‌ మాజీ ఛైర్మన్‌ కె.జయరాజ్‌, ఎం.బాపిరాజు, పలువురు నాయకులు పాదయాత్రలో పాల్గొన్నారు. పలు చోట్ల పాదయాత్ర రథానికి స్థానికులు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. 

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని