AP News: క్యాలెండర్‌ రూపంలో ‘అమరావతి ఉద్యమం’

రాజధానిని 3 ముక్కలు చేసిన సీఎం జగన్‌ ఇప్పుడు అమరావతి  ప్రాంతాన్ని 3 ముక్కలు చేస్తానంటున్నారని అమరావతి ఐకాస  ప్రతినిధులు ఆరోపించారు. మూడు

Updated : 12 Jan 2022 17:38 IST

విజయవాడ: రాజధానిని 3 ముక్కలు చేసిన సీఎం జగన్‌ ఇప్పుడు అమరావతి  ప్రాంతాన్ని 3 ముక్కలు చేస్తానంటున్నారని అమరావతి ఐకాస  ప్రతినిధులు ఆరోపించారు. మూడు ముక్కలాట ఇకనైనా మానుకుంటే మంచిదని గ్రహించాలని హితవు పలికారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయి సిద్ధంగా ఉన్న ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వకుండా కొత్తగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మొదలు పెట్టారని నేతలు మండిపడ్డారు. ఇప్పటి నుంచి చేసే అమరావతి ఉద్యమం ఎంతో కీలకమని తెలిపారు.

విజయవాడలో మహాపాదయాత్ర నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అమరావతి ఉద్యమంలో వివిధ ఘట్టాలు వివరిస్తూ అమరావతి ఐకాస, రైతు ఐకాసల ఆధ్వర్యంలో క్యాలెండర్‌ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, అమరావతి పరిరక్షణ సమితి నాయకులు, సానుభూతి పరులు పాల్గొన్నారు. రాక్షసుల నుంచి అమరావతి భూముల్ని కాపాడుకోవాలని కోరారు. మంచి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం చేసే పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటిలో అమరావతి ఉద్యమం గురించి తెలియాలంటే ఈ క్యాలెండర్‌ ఉపయోగపడుతుందని, అందుకే ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి అమరావతిని కాపాడుకుంటామని ఐకాస ప్రతినిధులు స్పష్టం చేశారు. ఐకాస కన్వీనర్ శివారెడ్డి, కో కన్వీనర్‌ గద్దె తిరుపతిరావు, మహిళా జేఏసీ కన్వీనర్‌ రాయపాటి శైలజ, రైతు ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్‌ పువ్వాడ సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని