AP High Court: అమరావతి రింగ్‌రోడ్డు కేసు.. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో బెయిలు ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు హైకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ బుధవారానికి వాయిదా పడింది.
అమరావతి: రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో బెయిలు ఇవ్వాలని కోరుతూ తెదేపా అధినేత చంద్రబాబు హైకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. బుధవారం మధ్యాహ్నం 2.15 గంటలకు వాదనలు వింటామని న్యాయమూర్తి తెలిపారు.
రాజధాని నగరానికి సంబంధించిన బృహత్ ప్రణాళిక డిజైనింగ్, ఇన్నర్ రింగ్‌రోడ్డు, దాన్ని అనుసంధానించే రహదారుల ఎలైన్‌మెంట్‌లో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 2022 ఏప్రిల్ 27న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అదే ఏడాది మే 9న సీఐడీ పలువురిపై కేసు నమోదు చేసింది. చంద్రబాబును మొదటి నిందితుడిగా పేర్కొంది. ఈ కేసులో తనకు బెయిలు మంజూరు చేయాలని చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. చంద్రబాబు తరఫున వర్చువల్‌గా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థలూథ్రా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు పూర్వాపరాలను కోర్టు దృష్టికి తెచ్చారు. రాజకీయ కారణాలతోనే కేసు నమోదు చేశారని వివరించారు. సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Supreme court: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) బెయిల్ రద్దు కోరుతూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. -
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/11/2023)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.


తాజా వార్తలు (Latest News)
-
Stock Market: ఆద్యంతం ఒడుదొడుకులు.. ఆఖర్లో లాభాలు.. 19,880 ఎగువన నిఫ్టీ
-
Rashmika: అవధులు లేని మీ అభిమానానికి కృతజ్ఞతలు.. స్పెషల్ ఫొటో షేర్ చేసిన రష్మిక
-
Australia: మిగిలిన టీ20లకు ఆసీస్ జట్టులో భారీ మార్పులు..!
-
Robbery: ప్రముఖ నగల దుకాణంలో 25కిలోల బంగారు ఆభరణాలు చోరీ
-
Cameron Green: గ్రీన్ కోసం రూ.17.5 కోట్లా?.. ఆర్సీబీ వ్యూహమేంటీ?
-
Zuckerberg: రోజుకు 4వేల కేలరీల ఆహారం తీసుకుంటా.. ఆసక్తికర విషయాలు పంచుకున్న జుకర్‌బర్గ్