corona: గ్రామీణ అంబులెన్సు

కరోనా కారణంగా ఎంతోమంది ఊపిరాగింది. వైద్యం అందక కొంతమంది, సరైన సమయంలో ఆసుపత్రికి చేరలేక..

Updated : 27 Jun 2021 05:32 IST

అమరావతి: కరోనా కారణంగా ఎంతోమంది ఊపిరాగింది. వైద్యం అందక కొంతమంది, సరైన సమయంలో ఆసుపత్రికి చేరలేక మరికొంతమంది మరణించారు. అలాంటి పరిస్థితులను చూసి చలించిపోయిన అనంతపురానికి చెందిన ఓ మిత్రబృందం గ్రామీణ ప్రజల కోసం అన్ని సౌకర్యాలతో కూడిన డ్రైవర్ లేని అంబులెన్సులను రూపొందించింది. అత్యవసర వైద్యం అందించాల్సిన రోగికోసం ఈ అంబులెన్సును ఎక్కడికైనా తీసుకెళ్లేలా సిద్ధం చేశారు. ఎం.జి చారిటీస్‌ పేరుతో మూడు లక్షలు వెచ్చించి మూడు అంబులెన్సులను తయారుచేయించారు. మరో వాహనానికి తగిలించి తీసుకెళ్లేందుకు వీలుగా వీటిని రూపొందించారు. ప్రజల అవసరాల నిమిత్తం ఇలాంటివి మరిన్ని తయారు చేయిస్తామని దాతలు చెబుతున్నారు.  
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని