ఆమె మద్యం తాగదు.. అయినా మత్తెక్కుతోంది!

మద్యం పరిమితంగా తాగితే పర్వాలేదు.. అదే, అడ్డు అదుపు లేకుండా తాగితే మనిషికి మత్తు ఎక్కుతుంది. ఆ మైకంలో వారు ఏం చేస్తున్నారో వారికే గుర్తుండదు. అయితే, అమెరికాకు చెందిన ఓ మహిళకు అసలు మద్యమే అలవాటు లేదు. ఎప్పుడూ దాన్ని ముట్టనూలేదు. అయినా ఆమెను

Published : 03 Feb 2021 21:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మద్యం పరిమితంగా తాగితే పర్వాలేదు.. అదే, అడ్డు అదుపు లేకుండా తాగితే మనిషికి మత్తు ఎక్కుతుంది. ఆ మైకంలో వారు ఏం చేస్తున్నారో వారికే గుర్తుండదు. అయితే, అమెరికాకు చెందిన ఓ మహిళకు అసలు మద్యమే అలవాటు లేదు. ఎప్పుడూ దాన్ని ముట్టనూలేదు. అయినా ఆమెను నిత్యం మత్తు ఆవహిస్తోంది. మద్యం తాగినవాళ్లలా మార్చేస్తోంది. ఇందుకు ఆటో-బ్రేవరీ సిండ్రోమ్‌(ఏబీఎస్‌) అనే వ్యాధి కారణమని వైద్యులు వెల్లడించారు.

కనెక్టికట్‌లో నివసించే 38 ఏళ్ల సారా లెఫెబ్రే కడుపులో ఈస్ట్‌ ఫంగస్‌ అధిక మోతాదులో ఇథనాల్‌గా మారుతోంది. ఈ ఇథనాల్‌ రక్తంలో చేరి శరీరమంతా వ్యాపిస్తోంది. దీంతో అచ్చం మద్యం తాగినవాళ్లకు వచ్చినట్లుగానే సారాకు మత్తు వస్తోంది. ఈ సమస్యతో సారా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఓ సారి ఆమె మద్యం మత్తులో స్పృహ లేకుండా శరీరం గడ్డకట్టుకుపోయే చలిలో ఇంటి బయటే పడుకుంది. తాగకపోయినా ట్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో ఆరుసార్లు పోలీసులకు చిక్కింది. మద్యం మత్తులో నడుస్తూ కిందపడి అనేక సార్లు ఎముకలు విరిగాయి. ఈ సమస్య తెలియక మొదట్లో వైద్యులు ఆమెను మద్యం తాగడం మానేయాలని సూచించేవారట. ఎట్టకేలకు గతేడాది వైద్యులు సారాకు అనేక పరీక్షలు నిర్వహించి ఏబీఎస్‌ సిండ్రోమ్‌ ఉన్నట్లు తేల్చారు.

సారా ఎదుర్కొంటున్న సమస్యకు కాలేయం మార్పిడి ఒక్కటే మార్గమని వైద్యులు వెల్లడించారు. అవయవ మార్పిడి జరిగే వరకు యాంటి-ఫంగల్‌ చికిత్స తీసుకోవచ్చని వైద్యులు సూచించారు. ప్రస్తుతం ఆమె ఈ చికిత్స తీసుకుంటూనే కాలేయ మార్పిడి కోసం ప్రయత్నాలు చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు