Coma: కోమా నుంచి బయటికొచ్చి తెలియని యాసలో మాట్లాడుతోంది!

ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిన వ్యక్తులు కోలుకోవడానికి ఎంత కాలమైనా పట్టొచ్చు. ఒక వేళ కోమా నుంచి బయటకొచ్చినా కొందరు గతం మర్చిపోవడం లేదా వింతగా ప్రవర్తిస్తుండటం చూస్తుంటాం. కానీ, అమెరికాకు చెందిన ఓ మహిళ కోమా నుంచి బయటకొచ్చి.. అసలు తనకు ఏ

Updated : 03 Nov 2021 05:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిన వ్యక్తులు కోలుకోవడానికి ఎంత కాలమైనా పట్టొచ్చు. ఒక వేళ కోమా నుంచి బయటకొచ్చినా కొందరు గతం మర్చిపోవడం లేదా వింతగా ప్రవర్తిస్తుండటం చూస్తుంటాం. కానీ, అమెరికాకు చెందిన ఓ మహిళ కోమా నుంచి బయటకొచ్చి.. అసలు తనకు ఏ మాత్రం తెలియని కివీ భాష యాసలో అనర్గళంగా మాట్లాడుతూ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

లాస్‌ ఎంజిలెస్‌కు చెందిన 24 ఏళ్ల సమ్మర్‌ డియాజ్‌ కొన్ని నెలల కిందట కారు ప్రమాదానికి గురైంది. తను రోడ్డు దాటుతుండగా.. ఓ కారు వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డియాజ్‌ తీవ్రంగా గాయపడింది. మెదడుకూ దెబ్బతగలడంతో కోమాలోకి వెళ్లింది. రెండు వారాల తర్వాత కోలుకున్నా.. మాట్లాడలేని పరిస్థితి తలెత్తింది. తను యూనివర్సిటీలో నేర్చుకున్న సంజ్ఞ భాషతోనే మాట్లాడుతూ రోజులు వెళ్లదీసింది. కొంతకాలానికి ఆమెకి తిరిగి మాటలొచ్చినా వింతగా న్యూజిలాండ్‌ కివీ భాష(ఇంగ్లీష్‌ భాషే కానీ.. యాసలో చాలా తేడా ఉంటుంది)లో మాట్లాడటం ప్రారంభించింది. గతంలో ఒక్కసారి కూడా డియాజ్‌ న్యూజిలాండ్‌కు వెళ్లలేదు.. అక్కడి యాస గురించి తెలియదు. అయినా తను కివీ యాసలో మాట్లాడటం విడ్డూరం.

అయితే, డియాజ్‌ను పరీక్షించిన వైద్యులు ఆమెకు ఫారెన్‌ యాసెంట్‌ సిండ్రోమ్‌ ఉన్నట్లు స్పష్టం చేశారు. మాట్లాడే భాషలో ఆకస్మాత్తుగా మార్పులు వస్తుంటాయని వైద్యులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని