ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్‌కౌంటర్‌

ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌ మరువక ముందే ఆదివారం తుపాకుల

Published : 11 Apr 2021 16:56 IST

ఛత్తీస్‌గఢ్‌: ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌ మరువక ముందే ఆదివారం తుపాకుల మోతతో అక్కడి అడవులు మరోసారి దద్దరిల్లాయి. దంతెవాడ జిల్లాలో జవాన్లకు మవోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక మావోయిస్టు మృతి చెందాడు. మావోయిస్టు మిలీషియా కమాండర్‌ వెట్టి హుంగా మరణించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఇంకొందరు మావోయిస్టులు కూడా ఈ ఘటనలో మరణించి ఉంటారని భావిస్తున్నారు. హుంగాపై రూ.లక్ష రివార్డు ఉంది. కాల్పులు జరిగిన ప్రాంతంలో 8ఎం.ఎం. పిస్టల్‌, నాటు తుపాకీ, 2కిలోల ఐఈడీ, టపాసులు, మావోయిస్టు సాహిత్యం, కొన్ని మందులను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని