ఐదేళ్ల కిందటి ఫొటో వెనుక అందమైన ప్రేమ కథ..!
వైరల్‌గా మారిన ఓ ఐఏఎస్ అనుభవం
దిల్లీ: భగభగమండే సూర్యుడికి విశ్రాంతినిస్తూ..చిరుజల్లుల వర్షం. చెంత ఉంది ఒక్కటే గొడుగు. పక్కనే ఉంది జీవితాంతం తోడుంటానని మాటిచ్చిన తన ఇష్టసఖుడు. ఇంకేముంది ఒక్కపెట్టున కురిసిన వాన వారి ప్రయాణాన్ని ఒకే గొడుగు కిందికి చేర్చింది. అలా గమ్యంవైపు సాగుతున్న వారి అపురూప దృశ్యం ఓ కెమెరా కన్నును మెప్పించింది. తెల్లారి వార్తా పత్రికలో దర్శనమిచ్చింది. అయితే ఆషామాషీగా తీసిన ఆ చిత్రం వెనక ఓ గమ్మత్తైన స్టోరీ ఉంది తెలుసా..! ఆ చిత్రంలో ఉన్న యువతి చెప్పిన విషయం ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. అదేంటో మనమూ చదివేద్దామా..!!
పైన చూస్తోన్న ఈ చిత్రం 2016లో తీసింది. ఆ యువతి పేరు చాంద్ని చంద్రన్. ఐఏఎస్ అధికారిణి కావాలనే లక్ష్యంతో 2015లో సివిల్స్ పరీక్షలు రాశారు. ఫలితాలు కోసం వేచి చూస్తున్నారు. ఎంపిక అవుతానా? లేదా?అని ఆమె మదిలో ఎన్నో ఆలోచనలు. ఈ ఒత్తిడిని తట్టుకోలేక తన స్నేహితుడితో అలా సరదాగా గడిపేందుకు బయటకు వెళ్లారు. అప్పుడే వర్షం రావడం, వారు ఒకేగొడుగు కింద నడవడం, ఆ దృశ్యం తెల్లారి వార్తాపత్రికలో పడటం అన్నీ చకచకా జరిగిపోయాయి. కానీ, ఆ పరీక్షల్లో చాంద్ని ఎంపిక కాలేకపోయారు. అయితే సివిల్స్‌లో మంచి ర్యాంకు సాధించిన వారి పక్కనే వీరి చిత్రం కూడా ప్రచురితమైంది. నగరంలో వర్షాలకు సూచనగా ఓ ఆంగ్ల పత్రిక దాన్ని వేసింది. అయితే అప్పటికి వారిద్దరి పెళ్లి కాకపోవడంతో ఆమె స్నేహితుడు..ఇప్పుడు ఆమె భర్త అరుణ్ సుదర్శన్ ఆ వార్తాసంస్థకు ఫిర్యాదు చేశారు. ‘ఆ ఫొటోలో తప్పేం లేదు! కానీ, అవే ఇంట్లో ఇబ్బంది కలిగించే పరిస్థితులకు దారితీస్తాయి’ అంటూ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు చాంద్ని సమాధానమిచ్చారు. అందుకే మేం ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని అప్పటి పరిస్థితిని వివరించారు.
‘2017 సివిల్స్ పరీక్షల్లో నేను అనుకున్నది సాధించాను. ఇప్పుడు నేను త్రిపురలోని కాంచన్‌పూర్‌లో సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. అరుణ్, నేను పెళ్లి చేసుకున్నాం. ఈ మధ్య మా ఇద్దరికి ఆ ఫొటో గుర్తొచ్చింది. వెంటనే అరుణ్ ఆ ఫొటోగ్రాఫర్‌కు ఫొన్ చేసి, దాన్ని తెప్పించారు. ఎందుకోగానీ, వెంటనే ఈ విషయాన్ని నెటింట్లో పంచుకోవాలని అనిపించి, మీకు షేర్ చేశాను’ అంటూ సినిమా కథకు ఏ మాత్రం తీసిసోని తన అనుభవాలను గుర్తుచేసుకున్నారు చాంద్ని. అలాగే కృతజ్ఞతలు మాత్రమే సరిపోవంటూ ఆ ఫొటోగ్రాఫర్‌ను కూడా తన స్టోరీకి ట్యాగ్ చేశారు.
‘మీ ప్రేమ కథ చాలా అందంగా ఉంది’ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఐదేళ్ల క్రితం ఆ చిత్రాన్ని బంధించిన ఆ ఫొటోగ్రాఫర్ కూడా స్పందించారు. నేను ఏదో ఆషామాషీగా క్లిక్ చేసిన ఆ చిత్రం వెనుక ఇంత కథ ఉండటం నాకెంతో ప్రత్యేకం. ఐదేళ్ల తర్వాత ఈ విషయం తెలియడం చాలా ఆనందంగా ఉంది. మీరిద్దరు చాలా అందమైన జంట. మీ ప్రయాణంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది’ అంటూ ఆయన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘మీ మీద ఫిర్యాదు చేసిన వ్యక్తుల కోసం..ఐదు సంవత్సరాల నాటి ఫొటోని వెతికి ఇచ్చారు. మీది చాలా మంచి మనస్సు’ అంటూ చాంద్ని అభిమానాన్ని చాటుకున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (10/08/2022)
-
World News
Spy Ship: వద్దంటున్నా.. శ్రీలంక వైపు వస్తున్న చైనా నిఘా నౌక
-
India News
Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
-
Sports News
T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
-
Viral-videos News
Viral Video: రోడ్డుపై నీటి గుంత.. అందులోనే స్నానం చేస్తూ వ్యక్తి నిరసన!
-
Movies News
Social Look: నయన్-విఘ్నేశ్ వెడ్డింగ్ ప్రోమో.. అనుపమ విజయవాడ ప్రయాణం..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
- Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
- Rudi Koertzen : రోడ్డు ప్రమాదంలో దిగ్గజ అంపైర్ మృతి.. స్పందించిన సెహ్వాగ్
- Kolkata: బికినీ ధరించిన ప్రొఫెసర్.. రూ.99కోట్లు కట్టాలంటూ యూనివర్సిటీ ఆదేశం!
- Social Look: నయన్-విఘ్నేశ్ వెడ్డింగ్ ప్రోమో.. అనుపమ విజయవాడ ప్రయాణం..
- Spy Ship: వద్దంటున్నా.. శ్రీలంక వైపు వస్తున్న చైనా నిఘా నౌక
- Gali Janardhana Reddy: ‘గాలి’ అడిగితే కాదంటామా!
- Arthroscopy: మీ మోకీలుకు నొప్పి ఎక్కువగా ఉందా..? ఏం చేయాలో తెలుసా..!
- Chile sinkhole: స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్..!
- Jaishankar: సరికొత్త ఆలోచనలతో చకచకా చేస్తున్నారు.. సిబ్బందికి కేంద్ర మంత్రి ప్రశంసలు