Anand mahindra: మారుమూల మెకానిక్‌.. మహీంద్రా మనసు దోచాడు

ఎక్కడో మారుమూల గ్రామాల్లో సరదాగా పాటలు పాడి.. సెలబ్రెటీలైన వాళ్లను ఇటీవలి కాలంలో చూశాం. సంగీత నేపథ్యం లేకున్నా.. వాళ్లు పాడే పాటలు వింటే వీళ్లు నిజంగా

Updated : 30 Dec 2021 01:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎక్కడో మారుమూల గ్రామాల్లో సరదాగా పాటలు పాడి.. సెలబ్రెటీలైన వాళ్లను ఇటీవలి కాలంలో చూశాం. సంగీత నేపథ్యం లేకున్నా.. వాళ్లు పాడే పాటలు వింటే వీళ్లు నిజంగా ప్రొఫెషనల్‌ సింగర్‌ అనక మానదు. ఇటీవలికాలంలో అలా పేరు సంపాదించిన వాళ్లలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన బేబీ ఒకరైతే..   పశ్చిమ బెంగాల్‌ల్లోని రైల్వే స్టేషన్‌లో పాట పాడి వైరల్‌ అయిన రాను మోండల్‌ మరొకరు. తాజాగా ఆ జాబితాలో చేరారు ఓ వ్యక్తి. మెకానిక్‌ పనిచేస్తూ పాటలు పాడే ఈ యువకుడిని ప్రపంచానికి పరిచయం చేశారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ కొత్త ప్రతిభను పరిచయం చేసే మహీంద్రా బుధవారం మెకానిక్‌ ప్రతిభ తెలియజేస్తూ ఓ పోస్ట్‌ చేశారు.‘వాహనాల్ని బాగు చేయడానికి ఇతనికి తన గ్యారేజ్‌ ఉపయోగపడి ఉండొచ్చు. కానీ అతడి టాలెంట్‌ గ్యారేజ్‌ ఆత్మగా మారింది’ అంటూ ట్వీట్‌ చేశారు. పబ్లిక్‌ కోరిక మేరకు 1964లో వచ్చిన హిందీ చిత్రం ‘దోస్తి’ సినిమాలోని ‘‘చాహోంగా మే తుఝే సాంజ్ సవేరా’ సూపర్ హిట్ సాంగ్ను ఆలపించారు. కాగా.. మెకానిక్ వాయిస్ కు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు. వాటే వాయిస్.. అని మెచ్చుకుంటున్నారు. మరి అతడెలా పాడాడో మీరూ వినేసేయండి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని