
Anand Mahindra: చిన్న పిల్లాడి మోటివేషనల్ స్పీచ్.. ఫిదా అయిన ఆనంద్ మహీంద్రా
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ప్రేరణ కలిగించే, ఆలోచన రేకెత్తించే పోస్టులు పెడుతుంటారయన. ఇదే క్రమంలో మరో స్ఫూర్తిదాయక వీడియోని తాజాగా తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ఇందులో ఒక చిన్న పిల్లాడు.. జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించడం, కోపాన్ని దూరం చేయడం, బాధలు వంటి అంశాలపై మాట్లాడాడు. ఇందులో ఆ బాలుడు మాట్లాడిన మాటలకు ఆనంద్ మహీంద్రా ఫిదా అయ్యారు.
‘‘ఈ చిన్న పిల్లాడు మోటివేషనల్ స్పీకర్ ప్రేమ్ రావత్‌ను ఉటంకిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. అలా అని అతడు యువ గురువు కాదు. కానీ, పిల్లలు అమాయకంగా మాట్లాడిన మాటలకు అసమానమైన శక్తి, ప్రభావం ఉంటుంది. ‘నేను రోజూ ఏమి సాధన చేస్తున్నాను’.. అని ఈ బాలుడు మాట్లాడిన మాటలు నన్ను నేను మళ్లీ పరిశీలించేకునేలా చేశాయి’’ అని బాలుడు మాట్లాడుతున్న వీడియోకి క్యాప్షన్ జత చేశారు ఆనంద్ మహీంద్రా. ఈ వీడియోని చూసిన నెటిజన్లు బాలుడి తెలివితేటలకు ఫిదా అవుతున్నారు.