Anand Mahindra: ఏఐ గురించి ఆందోళన అక్కర్లేదు: మహీంద్రా

కృత్రిమమేధ (AI) గురించి తాను ఎక్కువగా ఆందోళన చెందడంలేదని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) అన్నారు. ఈ మేరకు ఆయన ఏఐ సృష్టించిన ఓ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశారు.

Published : 25 Apr 2023 01:44 IST

ముంబయి: కృత్రిమమేధ (AI)తో ఉద్యోగాలకు ముప్పు వాటిల్లే ప్రమాదంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సాంకేతిక రంగ నిపుణులు, పారిశ్రామిక వేత్తలు, ప్రముఖ కంపెనీల సీఈవోలు తమ తమ అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలోనే పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) సైతం ఏఐపై తన స్పందన తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఏఐ సృష్టించిన ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. అందులో ఒక అమ్మాయి ఐదేళ్ల వయసు నుంచి  95 ఏళ్ల వృద్ధురాలిగా మారడాన్ని చూపించారు.

ఈ వీడియోను ఆనంద్‌ మహీంద్రా తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ..‘‘ వరుస క్రమంలో మారే ఈ వీడియో ఏఐ సాయంతో జనరేట్ చేసింది. ఇందులో ఒక అమ్మాయి ఐదేళ్ల వయసు నుంచి 95 ఏళ్ల వయసు వరకు ఎలా మారుతుందనేది చూడొచ్చు. నేను ఏఐ గురించి ఎక్కువగా ఆందోళన చెందడంలేదు. ఎందుకంటే? అది ఎంతో అందమైన వాటిని సృష్టిస్తోంది’’ అని ట్వీట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘‘ఇది రియాలిటీకి దగ్గరగా ఉంది’’, ‘‘నిజంగా చాలా బాగుంది. కానీ, ఇది మనిషి మేధస్సు, పనితనాన్ని తీసుకెళ్లిపోతుంది. ప్రపంచం ఉద్యోగ సంక్షోభాన్ని ఎదుర్కొబోతుంది’’, ‘‘ఏఐ ఫిక్షన్‌ సినిమాలాంటిది. మనిషి మెదడు డైరెక్టర్‌ లాంటిది. డైరెక్టర్‌ లేకుండా ఏఐ లేదు’’ అని కామెంట్లు చేస్తున్నారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని