Anand Mahindra: ఇలాగైతే.. ట్రాఫిక్ సిగ్నల్స్ అవసరమేలేదు, కానీ!
నిత్యం రోడ్ల (Roads)పై ట్రాఫిక్(Traffic)తో సతమతమయ్యే వారికి ట్రాఫిక్ సిగ్నల్స్ (Traffic Signals) లేని రోడ్డు కనిపిస్తే.. ఇంకేముందు రయ్ రయ్ మంటూ దూసుకెళ్లిపోతారు. అలాంటి రోడ్ డిజైన్‌నే ఆనంద్ మహీంద్రా (Anad Mahindra) షేర్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: మెట్రోపాలిటన్ నగరాల్లో ట్రాఫిక్ (Traffic) క్రమబద్ధీకరణ సవాల్‌తో కూడుకున్న వ్యవహారం. ముఖ్యంగా బిజీ సమయాల్లో అయితే.. చెప్పాల్సిన అవసరంలేదు. కొద్దిపాటి దూరానికి కూడా గంటల సమయం పడుతుంది. రోడ్ల (Roads)పై వాహనాల (Vehicles) రద్దీ పెరగకుండా అక్కడక్కడా ట్రాఫిక్ సిగ్నల్స్(Traffic Signals)ను ఏర్పాటు చేస్తారు. అయినా కొంతమంది సిగ్నల్స్ పడినా ఆగకుండా వెళ్లిపోతుంటారు. అలాంటి వారి వల్ల ఇతరులకు ప్రమాదమే. ఒకవేళ రోడ్లపై ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోతే ఎలా ఉంటుంది? హాయిగా తక్కువ సమయంలో గమ్యాన్ని చేరుకోవచ్చు కదా. ఇదే ఆలోచనతో డిజైన్ చేసిన వీడియోను ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోలో కనిపిస్తున్న రోడ్డులో వాహనాలు ఎక్కడా ఆగాల్సిన అవసరం లేకుండా ముందుకు సాగుతుంటాయి.
‘‘అద్భుతం. యెమెన్‌కు చెందిన మహమ్మద్ అవాస్ అనే ఇంజనీర్ ఈ డిజైన్‌ను 2016లో రూపొందించాడు. దీంతో ట్రాఫిక్ లైట్లు లేకుండా సగం చుట్టూ తిరిగి వెళ్లడం ద్వారా నిరంతరం ట్రాఫిక్ నియంత్రణ జరుగుతుంది. కానీ, ఇది అధిక ఇంధనం వినియోగానికి దారితీస్తుందా?’’ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘‘ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు సిగ్నల్స్ మాత్రమే సరైన పరిష్కారం. ఈ డిజైన్‌తో రోడ్లపై ట్రాఫిక్ పెరగడంతోపాటు.. వాహనదారులకు ఇబ్బందులు తప్పవు’’ అని కామెంట్లు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Team India: భారత క్రికెట్ చరిత్రలో అరుదైన ఫీట్..
-
Vijay Deverakonda: ఆ బ్రాండ్‌కు విజయ్ దేవరకొండ బై.. ఈసారి అంతకుమించి!
-
Mohajer-10: 2 వేల కి.మీల దూరం.. 24 గంటలు గాల్లోనే.. సరికొత్త డ్రోన్లు ప్రదర్శించిన ఇరాన్
-
Vande Bharat Express: 9 రైళ్లు ఒకేసారి ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల నుంచి 2.. ఆగే స్టేషన్లు ఇవే..!
-
10 Downing Street: బ్రిటన్ ప్రధాని నివాసంలో.. శునకం-పిల్లి కొట్లాట!
-
Chiru 157: చిరంజీవిని అలా చూపించాలనుకుంటున్నా: దర్శకుడు వశిష్ఠ