Anand Mahindra: కంపెనీలు ఇలాంటి ఉత్పత్తులను తయారు చేయాలి!

అగ్నిప్రమాదంలో చిక్కుకున్న వారు మెట్ల మార్గం మూసుకుపోయినా, పై అంతస్తు నుంచి దూకి ప్రాణాలు కాపాడుకునేలా సరికొత్త ఉత్పత్తులు అందుబాటులో ఉంటే ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు.

Published : 06 Feb 2023 01:21 IST

ముంబయి: ఎత్తైన భవన సముదాయాలు, అపార్ట్‌మెంట్‌ల వద్ద  అగ్నిప్రమాదాలు (Fire Accident) సంభవించినప్పుడు సులువుగా బయటపడేందుకు మార్గం లేకపోతే ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుతుంది. ఈ క్రమంలో అగ్నిప్రమాదం నుంచి భయటపడేందుకు కొంత మంది పైఅంతస్తుల నుంచి కిందికి దూకేస్తుంటారు. దీంతో గాయాలపాలవ్వడం లేదా ప్రాణాలు కోల్పోవడం వంటి విషాదాలు జరుగుతుంటాయి. ఒకవేళ అగ్నిప్రమాదంలో చిక్కుకున్న వారు మెట్ల మార్గం మూసుకుపోయినా, పై అంతస్తు నుంచి దూకి ప్రాణాలు కాపాడుకునేలా సరికొత్త ఉత్పత్తులు అందుబాటులో ఉంటే ప్రాణ నష్టాన్ని నివారించవచ్చు. ఇదే ఆలోచనతో రూపొందించిన డివైజ్‌పై ప్రశంసలు కురిపించిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) ఆ వీడియోను  ట్విటర్‌లో షేర్ చేశారు. 

‘‘ఇది నిజమని నేను ఆశిస్తున్నాను. ఒక కంపెనీ ఈ డివైజ్‌ను తయారుచేస్తోంది. నేను ఎత్తైన భవనాల్లో నివస్తుంటే మొదట నేను దీన్ని కొంటాను. వినూత్నమైన ఆలోచన’’ అని ట్వీట్ చేశారు. వీడియోలో అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదంలో చిక్కుకున్న వ్యక్తి ఒక బ్యాగ్‌ను ధరించి కిటికీలోంచి దూకుతాడు. అతను కిందకి దూకే సమయంలో బ్యాగ్‌లోంచి పారాచ్యూట్‌ కమలం ఆకారంలో విచ్చుకుంటుంది. దాంతో కిందకు దూకినపుడు పూర్తి రక్షణగా ఉంటుంది. ఆనంద్‌ మహీంద్రా షేర్‌ చేసిన ఈ వీడియోను ఇప్పటి వరకు లక్ష మందికిపైగా వీక్షించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ‘గొప్ప ఆలోచన’, ‘భద్రత ఎంతో ముఖ్యం.. తప్పక కొనుగోలు చేయాల్సిన డివైజ్‌’అంటూ కామెంట్లు చేస్తున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు