శివరాత్రి వేళ.. మహీంద్రా స్ఫూర్తిదాయక ట్వీట్

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన పోస్ట్‌.. నెటిజన్లలో

Published : 11 Mar 2021 14:59 IST

ముంబయి: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన పోస్ట్‌.. నెటిజన్లలో ఆలోచనలు రేకెత్తిస్తోంది. స్ఫూర్తిని నింపుతోంది. ‘‘అజ్ఞానాన్ని, చీకటిని అధిగమించేందుకు శివరాత్రి జరుపుకొంటాం. మన చుట్టూ ఉన్న చీకటిని పారదోలాలని భగవంతుడిని ప్రార్థిస్తాం. కానీ మనలోని అజ్ఞానం, చీకటిని మర్చిపోతున్నాం. ఎక్కడ చూడాలో తెలిసినప్పుడే వెలుతురిని చూడగలం’’ అని మహీంద్రా ట్విటర్‌లో పేర్కొన్నారు. 

ప్రముఖుల శుభాకాంక్షలు..

మహా శివరాత్రి సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు రాజకీయ, సినీ, పారిశ్రామిక ప్రముఖులు ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థించారు.


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని