సలాం కుటుంబసభ్యులకు సీఎం జగన్‌ పరామర్శ

కర్నూలు జిల్లా నంద్యాలలో ఆత్మహత్యకు పాల్పడిన అబ్దుల్ సలాం కుటుంబసభ్యులను ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పరామర్శించారు

Updated : 27 Dec 2022 18:46 IST

నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాలలో ఆత్మహత్యకు పాల్పడిన అబ్దుల్ సలాం కుటుంబసభ్యులను ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పరామర్శించారు. తుంగభద్ర పుష్కరాల కోసం కర్నూలు వచ్చిన సీఎం జగన్‌ ఏపీఎస్పీ అతిథి గృహం వద్ద సలాం కుటుంబసభ్యలను కలిశారు. సలాం అత్త మాబున్నీసా, ఆమె కుమారుడు శంషావళీ, కుమార్తె సాజిదాను సీఎం ఓదార్చారు. తన కుమార్తె సాజిదాకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని జగన్‌ను సలాం అత్త మాబున్నీసా ఈ కోరారు. వైద్యశాఖలో పనిచేస్తున్న తన అల్లుడిని నంద్యాలకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆత్మహత్యకు బాధ్యులైనవారిని కఠినంగా శిక్షించాలని కోరారు. సలాం కుటుంబానికి అండగా ఉంటామని.. ఆత్మహత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జగన్‌ హామీ ఇచ్చారు. మాబున్నీసా కుమార్తెకు ఔట్‌సోర్సింగ్‌ కింద ఉద్యోగం ఇవ్వాలని.. అల్లుడు శంషావళిని అనంతపురం నుంచి నంద్యాలకు బదిలి  చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ వీరపాండ్యన్‌ను ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని