Andhra news: ఏపీ కొత్త జిల్లాలకు లోకల్‌ గవర్నమెంట్‌ డైరెక్టరీ కోడ్‌లు.. దేశంలో ఎన్ని జిల్లాలంటే!

ఆంధ్రప్రదేశ్‌లో 72 రెవెన్యూ డివిజన్లలో 26 జిల్లాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

Published : 06 Apr 2022 17:43 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 72 రెవెన్యూ డివిజన్‌లతో 26 జిల్లాలను(AP new districts) రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ కోడ్‌లను కేంద్రం జారీ చేసింది. స్థానిక ప్రభుత్వాలను మ్యాపింగ్ చేసేందుకు ప్రత్యేకంగా ఎల్‌జీడీ కోడ్‌లను కేటాయించారు. జనగణన నుంచి ప్రభుత్వ పథకాల వరకూ ఎల్‌జీడీ కోడ్ ద్వారానే కార్యక్రమాలను అమలు చేస్తారు. భౌగోళిక ప్రాంతాలు, రెవెన్యూ, గ్రామీణ, పట్టణ ప్రాంత స్థానిక ప్రభుత్వాలను కూడా లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ కోడ్ ద్వారానే కేంద్రం మ్యాపింగ్ చేయనుంది. పార్వతీపురం మన్యం జిల్లాకు 743, అల్లూరి జిల్లాకు 745, అనకాపల్లి 744, కాకినాడ 746, కొనసీమ 747, ఏలూరు 748, ఎన్టీఆర్ జిల్లాకు 749, బాపట్ల జిల్లాకు 750, పలనాడుకు ఎల్జీడీ కోడ్‌గా 751, తిరుపతి 752, అన్నమయ్య 753, శ్రీసత్యసాయి జిల్లాకు 754, నంద్యాల జిల్లాకు 755  జిల్లా కోడ్‌లను కేంద్రం కేటాయించింది. ఉమ్మడి జిల్లాలకు 502 నుంచి 521 వరకూ జిల్లా లోకల్ గవర్నమెంట్ కోడ్‌లను కేటాయించారు. ఏపీలో కొత్త ఏర్పాటైన 13 జిల్లాలతో కలిపి దేశంలో మొత్తం జిల్లాల సంఖ్య 755కు చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని