Andhra News: చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈనెల 27వ తేది ఉదయం 11గంటలకు మంగళగిరిలోని కమిషన్ కార్యాలయంలో విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

Published : 23 Apr 2022 01:32 IST

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈనెల 27వ తేది ఉదయం 11గంటలకు మంగళగిరిలోని కమిషన్ కార్యాలయంలో విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాచారం ఘటనపై విచారణ జరిపేందుకు వెళ్లిన తనను అడ్డుకుని, దూషించారని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అభియోగాలు మోపారు. 1998 ఏపీ మహిళా కమిషన్ చట్టంలోని సెక్షన్-14 ప్రకారం కమిషన్‌కు కోర్టు తరహాలో విచారణ జరిపే అధికారాలున్నట్లు నోటీసుల్లో తెలిపారు.

‘‘అత్యాచార బాధితురాలిని కలిసేందుకు ఆస్పత్రికి వెళ్లిన సమయంలో చంద్రబాబుతో వచ్చిన తెదేపా నాయకులు అడ్డుకొని గొడవకు దిగి ఉద్రిక్త పరిస్థితులు కల్పించారు. అక్కడి రోగులను భయాందోళనకు గురి చేసి నన్ను అసభ్య పదజాలంతో దూషించారు. గౌరవప్రదమైన హోదాలో ఉన్నవారిని ఇలా అవమానించడం తీవ్రంగా పరిగణిస్తున్నాం. 1998 మహిళా కమిషన్ చట్టం సెక్షన్ 15(1) ప్రకారం విచారణకు ఆదేశిస్తున్నాం. నిర్దేశించిన సమయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరై వివరణ ఇవ్వాలి. మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుకు కూడా ఇదే తరహా నోటీసులు జారీ చేశాం. ఆయనకు కూడా ఈనెల 27వ తేది ఉదయం 11గంటలకు విచారణకు రావాలని ఆదేశించాం’’ అని నోటీసుల్లో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని