మూడు రోజులపాటు ఏపీలో వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర, యానాంలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ..

Published : 29 Apr 2021 16:41 IST

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర, యానాంలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో పాటు ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రేపు ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని, ఎల్లుండి ఒకటి, రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం చూపే ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రస్తుతం బలహీనపడిందని వాతావరణ శాఖ తెలిపింది. సగటు సముద్ర మట్టానికి 0.9కి.మీ. ఎత్తు వద్ద ఇప్పటికే ఏర్పడి ఉన్న ఉత్తర-దక్షిణ ద్రోణి పశ్చిమ విదర్భ నుంచి ఇంటీరియర్‌ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు వ్యాపించినట్లు తెలిపింది. ఇది సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తు వద్ద బిహార్‌ తూర్పు ప్రాంతాల నుంచి దక్షిణ తీర ప్రాంతం ఒడిశా వరకు వ్యాపించి ఉన్నట్లు వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని