weather Update: ఏపీలో కొనసాగుతోన్న ఉష్ణోగ్రతల తీవ్రత.. రానున్న 3 రోజుల్లో మోస్తరు వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. వాయవ్య భారత్‌ నుంచి తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయని వెల్లడించింది..

Published : 20 May 2023 15:08 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. వాయవ్య భారత్‌ నుంచి తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయని వెల్లడించింది. తెలంగాణ, కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతోందని పేర్కొంది. అండమాన్ సముద్ర తీరప్రాంతాల నుంచి ఈశాన్య భారత్ వరకూ నైరుతి గాలులు బలంగా కదులుతున్నాయని తెలిపింది. రానున్న మూడు రోజుల్లోగా అండమాన్ నికోబార్ దీవులపై నైరుతి రుతుపవనాలు విస్తరించే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తద్వారా రాగల నాలుగైదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యానాం తదితర ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఏపీలోని కొన్ని చోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోని కొన్ని చోట్ల వేడిగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఏపీలోని వివిధ జిల్లాల్లోని ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా..

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కనిగిరిలో అత్యధికంగా 45.68 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. ప్రకాశం జిల్లా రాచెర్లలో 45.67, మంత్రాలయంలో 43.5, నెల్లూరు జిల్లా వెంకటాచలంలో 43.3, పల్నాడు జిల్లా రొంపిచర్లలో 43.04, తిరుపతి జిల్లా తొట్టంబేడులో 42.67, నంద్యాల చాగలమర్రిలో 42.67, యర్రగొండపాలెంలో 42.6, కడప జిల్లా కొండాపురంలో 42.5, బాపట్లలో 42.3, చిత్తూరులో 41.82, ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో 41.8, తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో 41.4, కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో 41.33, కాకినాడలో 41.2, విజయనగరం జిల్లా పూసపాటి రేగలో 40.8, విజయవాడలో 40.87, గుంటూరు జిల్లా మంగళగిరిలో 40.55, ఏలూరులో 40.5, అనంతపురం జిల్లా గుత్తిలో 40.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని