AndhraPradesh : ‘చలో విజయవాడ’ విజయవంతంపై సీఎం జగన్‌ ఆరా

ఉద్యోగులు, ఉపాధ్యాయుల ‘చలో విజయవాడ’పై ఏపీ సీఎం వైఎస్‌ జగన్ ఆరా తీశారు. సచివాలయంలో జగన్‌ను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, తితిదే ఛైర్మన్‌...

Updated : 03 Feb 2022 15:28 IST

అమరావతి: ఉద్యోగులు, ఉపాధ్యాయుల ‘చలో విజయవాడ’పై ఏపీ సీఎం వైఎస్‌ జగన్ ఆరా తీశారు. సచివాలయంలో జగన్‌ను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ కలిశారు. చలో విజయవాడ విజయవంతం కావడంపై చర్చించారు. ఉద్యోగుల డిమాండ్లపై సీఎం జగన్‌ చర్చించినట్లు సమాచారం. మరోవైపు చలో విజయవాడకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత, దివ్యాంగ ఉద్యోగులు, ఒప్పంద, పొరుగు సేవల సిబ్బంది భారీగా తరలివచ్చారు. ఉద్యోగుల ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఎల్లుండి పెన్‌డౌన్‌ను చేపట్టనున్నారు. ఈ నెల 6వ తేదీ అర్ధ రాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తామని ఉద్యోగులు తెలిపారు.

కొత్త విద్యావిధానం వల్ల 22వేల మందికి పదోన్నతి: జగన్‌

క్యాంపు కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖపై జగన్‌ సమీక్షించారు. విద్యార్థుల సంఖ్యకు తగిన నిష్పత్తిలో టీచర్లు ఉంటాలని ఆదేశించారు. సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు ఉండాలని చెప్పారు. కొత్త విద్యా విధానం వల్ల 22 వేల మంది టీచర్లకు పదోన్నతి వస్తుందన్నారు. ఎస్‌జీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి ఇవ్వాలని ఆదేశించారు. పదోన్నతులు, బదిలీలు సత్వరమే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. జూన్‌ నాటికి విద్యావిధాన సంస్కరణలు పూర్తిగా అమల్లోకి రావాలని తెలిపారు. ప్రతి మండలంలో రెండు హైస్కూళ్లు, రెండు కాలేజీలు ఉండాలన్నారు. ఎస్‌సీఈఆర్‌టీ సిఫారుసులన్నీ అమల్లోకి రావాలని పేర్కొన్నారు. రీసోర్స్‌ సెంటర్‌ను మండల విద్యా శాఖాధికారి కార్యాలయంగా మార్పు చేయాలని చెప్పారు. ఎండీవో పరిధిలో కాకుండా ఎంఈవోకే డ్రాయింగ్‌ అధికారాలు అప్పగిస్తూ ఎస్‌ఈఆర్‌టీ చేసిన సిఫారసుకు సీఎం జగన్‌ ఆమోదం తెలిపారు. అలానే ఎంఈవో పోస్టుల భర్తీకి సీఎం జగన్‌ అంగీకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని