AndhraPradesh: పీఆర్సీ వేయడంలో రహస్య అజెండా ఉందేమో: ఏపీ విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ

విద్యుత్ శాఖలో పీఆర్సీ విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ ఉద్యోగుల సంఘం తప్పుబట్టింది. ఈ మేరకు ఇంధన శాఖ కార్యదర్శికి ఉద్యోగ సంఘాల జేఏసీ లేఖ రాసింది. విశ్రాంత

Published : 04 Feb 2022 21:17 IST

అమరావతి: విద్యుత్ శాఖలో పీఆర్సీ విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ ఉద్యోగుల సంఘం తప్పుబట్టింది. ఈ మేరకు ఇంధన శాఖ కార్యదర్శికి ఉద్యోగ సంఘాల జేఏసీ లేఖ రాసింది. విశ్రాంత ఐఏఎస్ మన్మోహన్‌ నేతృత్వంలోని పీఆర్సీని పక్కన పెట్టాలని విన్నవించింది. విద్యుత్ శాఖలో ఇప్పటి వరకు అధికారుల నేతృత్వంలోని పీఆర్సీ వేశారని గుర్తు చేసింది. అధికారుల నేతృత్వంలోని సంప్రదింపులతో కూడిన పీఆర్సీని వేశారని పేర్కొంది. ప్రభుత్వానికి రహస్య అజెండా ఉందేమోనని విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ అనుమానం వ్యక్తం చేసింది. బయటవారితో పీఆర్సీ వేయడం వెనుక రహస్య అజెండా ఉందని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని