Tirumala: ఈనెల 24న అంగప్రదక్షిణం టోకెన్ల కోటా విడుదల

శ్రీవారి అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఈనెల 24న విడుదల చేయనున్నట్లు తితిదే ఓ ప్రకటనలో పేర్కొంది.

Published : 24 Jan 2023 01:17 IST

తిరుమల: శ్రీవారి అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను రేపు (జనవరి 24న) విడుదల చేయనునున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచునున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఓ ప్రకటనను విడుదల చేసింది. శ్రీవారి ఆలయంలో బాలాలయం కారణంగా ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు అంగప్రదక్షిణం టోకెన్ల జారీని నిలిపివేశామని పేర్కొంది. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి ఆన్‌లైన్‌లో టోకెన్లు బుక్‌ చేసుకోవాలని తితిదే విజ్ఞప్తి చేసింది.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని