TS News: రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి
తెలంగాణ రాష్ట్రానికి మరో విదేశీ భారీ పెట్టుబడి వరించింది. కెనడాకు చెందిన ఇవాన్ హో కేంబ్రిడ్జ్ అండ్ లైట్ హౌస్ కాంటన్.. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో భారీ ల్యాబ్ స్పేస్‌ను తీసుకునేందుకు ముందుకొచ్చింది...
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి మరో విదేశీ భారీ పెట్టుబడి రానుంది. కెనడాకు చెందిన ఇవాన్ హో కేంబ్రిడ్జ్ అండ్ లైట్ హౌస్ కాంటన్.. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో భారీ ల్యాబ్ స్పేస్‌ను తీసుకునేందుకు ముందుకొచ్చింది. జీనోమ్ వ్యాలీలో సుమారు 100 మిలియన్ డాలర్లు (సుమారు రూ.740 కోట్లు) పెట్టుబడి పెడుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ల్యాబ్ స్పేస్‌లో సుమారు 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ పెట్టుబడిని వినియోగించనున్నట్లు తెలిపింది. కంపెనీ భారత ప్రతినిధులు చాణక్య చక్రవర్తి, శిల్పి చౌదరి, హరే కృష్ణ, సంకేత్ సిన్హాతో కూడిన బృందం మంత్రి కేటీఆర్‌తో వర్చువల్‌గా సమావేశమై ఈ విషయాన్ని వెల్లడించింది.
లైఫ్ సైన్సెస్ రంగ మౌలిక వసతుల కల్పనలో ఇవాన్ హొ కేంబ్రిడ్జ్ భారీ పెట్టుబడి ఒక మైలు రాయిగా నిలిచిపోతుందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జీనోమ్ వ్యాలీలో ఇప్పటికే 200కు పైగా లైఫ్ సైన్సెస్ కంపెనీలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని వివరించారు. తాజా పెట్టుబడితో లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రభుత్వ విజన్‌కు మరింత ఊతం లభిస్తుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Dhanbad: అక్రమ బొగ్గు గని కూలి ముగ్గురి మృతి.. శిథిలాల కింద చిక్కుకున్నవాళ్లెందరో?!
-
General News
TSPSC ప్రశ్నపత్రం లీకేజీ.. రూ.1.63 కోట్ల లావాదేవీలు: సిట్
-
Politics News
Revanth Reddy: మంత్రి కేటీఆర్ సవాల్‌ను స్వీకరిస్తున్నా: రేవంత్ రెడ్డి
-
General News
Andhra News: సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ తెస్తామని సీఎం హామీ ఇచ్చారు: వెంకట్రామిరెడ్డి
-
Sports News
Harbhajan Singh: పెద్ద మ్యాచుల్లో టీమ్ ఇండియా ఒత్తిడికి గురవుతోంది: హర్భజన్
-
Crime News
Khammam: దారి కాచిన మృత్యువు... ముగ్గురి మృతి