KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ నుంచి మరో లేఖ

విద్యుత్‌ కొనుగోళ్లపై విచారణ చేస్తున్న జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు మరో లేఖ రాసింది.

Published : 25 Jun 2024 19:34 IST

హైదరాబాద్‌: విద్యుత్‌ కొనుగోళ్లపై విచారణ చేస్తున్న జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు మరో లేఖ రాసింది. విద్యుత్‌ కొనుగోళ్ల అంశంపై మరింత సమాచారం ఇవ్వాలని ఈ నెల 19న లేఖ పంపించింది. యాదాద్రి, భద్రాద్రి విద్యుత్‌ ప్లాంట్ల నిర్మాణంపై మరిన్ని వివరాలు తెలియజేయాలని అందులో పేర్కొంది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి కొన్న విద్యుత్‌ గురించి మరింత సమాచారం కోరింది. ఇటీవల కమిషన్‌ ఎదుట పలువురు లేవనెత్తిన సందేహాలను లేఖలో ప్రస్తావించింది. వాటిపై ఈ నెల 27 లోపు సమాధానమివ్వాలని కమిషన్‌ సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని