Telangana News: టీఎస్‌పీఎస్‌సీ నుంచి మరో నోటిఫికేషన్‌.. ఈసారి 833 పోస్టులకు!

తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదలైంది. వివిధ విభాగాల్లో 833 ఇంజినీరింగ్‌ ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్‌

Updated : 13 Sep 2022 02:34 IST

హైదరాబాద్‌: తెలంగాణలో మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదలైంది. వివిధ విభాగాల్లో 833 ఇంజినీరింగ్‌ ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్‌సీ ప్రకటనను జారీ చేసింది. అసిస్టెంట్‌ ఇంజినీర్‌, మున్సిపల్‌ అసిస్టెంట్ ఇంజినీర్‌ పోస్టులు, టెక్నికల్‌ ఆఫీసర్‌, జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ పోస్టులకు భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈనెల 29 నుంచి అక్టోబర్‌ 21 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాలకు https://www.tspsc.gov.in/ సందర్శించాలని సూచించింది.

కాగా, ఇటీవల మున్సిపల్ శాఖలో 175 టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీస్‌ పోస్టులకు, రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖలో 23 పోస్టులకు టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts