తెలంగాణకు మరో టెక్స్‌టైల్‌ పరిశ్రమ

తెలంగాణలో మరో టెక్స్‌టైల్‌ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఈమేరకు గోకల్‌దాస్‌ ఇమేజెస్‌ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది...

Published : 09 Apr 2021 13:50 IST

హైదరాబాద్‌: తెలంగాణలో మరో టెక్స్‌టైల్‌ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఈమేరకు గోకల్‌దాస్‌ ఇమేజెస్‌ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి అప్పారెల్‌ రంగంలో గోకల్‌దాస్‌ ఇమేజెస్‌ పెట్టుబడులు పెట్టనుంది. కంపెనీ కార్యకలాపాలతో 1100 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. సిరిసిల్ల అప్పారెల్‌ పార్కులో ఈ సంస్థ తన కార్యకలాపాలు ప్రారంభించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని