ఏపీలో నేడు జాబ్‌ క్యాలెండర్‌ విడుదల 

ఏపీలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏయే శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో సమగ్ర సమాచారాన్ని శాఖల వారీగా...

Updated : 18 Jun 2021 00:32 IST

అమరావతి: ఏపీలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏయే శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో సమగ్ర సమాచారాన్ని శాఖల వారీగా సేకరించి ఖాళీల నివేదికను ప్రభుత్వం సిద్ధం చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు జాబ్‌ క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి విడుదల చేయనున్నారు. ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. వివిధ శాఖల్లో అవసరాల మేరకు ఉద్యోగాల భర్తీ జరుగనుంది. ఆర్థికశాఖ ఆమోదంతో విడతలవారీగా పరీక్షలు చేపట్టాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. విద్య, వైద్యం, పోలీసు శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకీ అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రెగ్యులర్‌, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌తో  కలిపి మొత్తం 10,143 ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని