Andhra News: న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేస్తేనే న్యాయం జరుగుతుంది: ఏపీ అడ్వొకేట్ జేఏసీ
న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేసినపుడే కక్షిదారులకు న్యాయం జరుగుతుందని ఏపీ అడ్వొకేట్ జేఏసీ అభిప్రాయపడింది. ఏపీ అడ్వొకేట్ జేఏసీకి చెందిన పలువురు న్యాయవాదులు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌ను కలిసి వినతిపత్రం అందించారు.
అమరావతి: న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేసినపుడే కక్షిదారులకు న్యాయం జరుగుతుందని ఏపీ అడ్వొకేట్ జేఏసీ అభిప్రాయపడింది. ఏపీ అడ్వొకేట్ జేఏసీకి చెందిన పలువురు న్యాయవాదులు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌ను కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలను నిలిపివేయాలని గవర్నర్‌ను కోరినట్లు చెప్పారు.
ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ డి. రమేష్‌లను కొలీజియం సిఫార్సు మేరకు బదిలీ చేయడం సరికాదన్నారు. ఇది సాధారణ బదిలీల్లో భాగంగా జరిగింది కాదని అడ్వొకేట్ జేఏసీ న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ అంశంపై గవర్నర్, ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను కూడా కలిసి వివరించినట్లు చెప్పారు. దీనిపై గవర్నర్ సానుకూలంగా స్పందించారన్నారు. అడ్వొకేట్ జేఏసీ అభ్యంతరాలను రాష్ట్రపతికి పంపాలని గవర్నర్‌ను కోరినట్లు చెప్పారు. ఈనెల 4న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విజయవాడకు రానున్నారని.. ఆమెను కలిసి వినతిపత్రం ఇచ్చే అవకాశం కల్పించాలని గవర్నర్‌ను కోరామని న్యాయవాదులు వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Sameera Reddy: మహేశ్‌బాబు సినిమా ఆడిషన్.. ఏడ్చుకుంటూ వచ్చేశా: సమీరారెడ్డి
-
India News
ఘోరం.. వ్యాధి తగ్గాలని 3 నెలల చిన్నారికి 51 సార్లు కాల్చి వాతలు..!
-
Movies News
OTT Movies: డిజిటల్ తెరపై మెరవనున్న బాలీవుడ్ తారలు
-
Politics News
Bhuma Akhila Priya: ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. భూమా అఖిలప్రియ గృహ నిర్బంధం
-
Crime News
Hyderabad: రామంతపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం
-
World News
Vladimir Putin: రష్యాను ఎదుర్కోవడం సులువు కాదు..: పుతిన్