Ap Cabinet: గ్రేటర్‌ విశాఖలో లక్ష ఇళ్ల నిర్మాణం.. ఏపీ కేబినెట్‌ నిర్ణయాలివే!

రాష్ట్రంలో సెప్టెంబర్‌ 22న వైఎస్‌ఆర్‌ చేయూత పథకాన్ని సీఎం జగన్‌ ప్రారంభిస్తారని మంత్రి చెల్లుబోయిన గోపాలకృష్ణ

Updated : 07 Sep 2022 17:49 IST

అమరావతి: రాష్ట్రంలో సెప్టెంబర్‌ 22న వైఎస్‌ఆర్‌ చేయూత పథకాన్ని సీఎం జగన్‌ ప్రారంభిస్తారని మంత్రి చెల్లుబోయిన గోపాలకృష్ణ తెలిపారు. 45 - 60 ఏళ్లలోపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం కోసం వైఎస్‌ఆర్‌ చేయూత పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఈ పథకానికి రూ.4,700 కోట్లను కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. వారంపాటు మండల స్థాయిలో మహిళలతో చేయూత వేడుకలు నిర్వహించనున్నట్లు చెప్పారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి గోపాలకృష్ణ మీడియాకు వివరించారు.

కేబినెట్‌ సమావేశంలో ఆమోదం పొందిన నిర్ణయాలివే..

* సీఆర్‌డీఏ చట్టంలోని ఓ క్లాజ్‌లో మార్పు చేస్తూ ఆమోదం.

* ఎస్‌ఐపీబీలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం.

* రాష్ట్రానికి రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి.

* ఇప్పటికే 175 మంది ఖైదీలకు రాష్ట్ర  ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టింది. అదనంగా మరో 20 మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టాలని నిర్ణయించింది.

* తిరుపతి పేరూరులో నోవాటెల్‌ హోటల్‌ నిర్మాణానికి భూమి మంజూరు.

* ఒబెరాయ్‌ గ్రూపునకు 30.32 ఎకరాలు మంజూరు.

* జల్‌జీవన్‌ మిషన్‌ అమలుకు రూ.4,020 కోట్ల రుణం తీసుకునేందుకు ఆమోదం.

* గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ర్యాటిఫికేషన్‌కు నిర్ణయం.

* గ్రామ సచివాలయాలకు రూ.20 లక్షల చొప్పున కేటాయిస్తూ ఆమోదం.

* గ్రేటర్‌ విశాఖలో లక్ష ఇళ్ల నిర్మాణానికి ఆమోదం. 21.30 లక్షల మందికి ఇళ్లు కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం.

* వర్సిటీల్లో అధ్యాపకులకు నెట్‌ పాస్‌ నిబంధనకు ఆమోదం.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని