Published : 18 Aug 2022 15:29 IST

Gorantla Madhav: ప్రైవేటు ఫొరెన్సిక్‌ ల్యాబ్‌ ఎలా ప్రామాణికం?: ఏపీ సీఐడీ చీఫ్‌ సునీల్‌

అమరావతి: హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌.. ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడుతున్నట్లు వైరల్‌ అయిన వీడియో ఇటీవల ఏపీలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష తెదేపా సహా ఇతర పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. వైరల్‌ అయిన ఆ వీడియోను అమెరికాలోని ఓ ఫొరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపామని.. అది నకిలీది కాదని తెదేపా నేతలు చెప్పారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్‌ మీడియాతో మాట్లాడారు. 

‘‘రాష్ట్రంలో ఒక వీడియో కాల్‌ వైరల్‌ అయింది. ఒక పురుషుడు- మహిళ మాట్లాడుకున్న వీడియో కాల్‌ను వేరొకరు రికార్డు చేసి సోషల్‌ మీడియాలో పెట్టారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఆ వీడియోలో ఉన్నట్లు కొందరు ఆరోపించారు. వీడియోలో మాట్లాడుకున్నదానిని వేరే ఫోన్‌లో రికార్డు చేసి పంపారు. అమెరికాలోని ఓ ప్రైవేటు ఫొరెన్సిక్‌ ల్యాబ్‌ ఎలా ప్రామాణికం? ప్రైవేట్‌ ల్యాబ్‌ రిపోర్టును మేం గుర్తించబోం. జిమ్‌ క్లిఫోర్డ్‌ ఇచ్చిన ధ్రువీకరణ పత్రం కూడా అసలైనది కాదు. స్వయంగా జిమ్‌ క్లిఫోర్డ్‌ ఆ అంశాన్ని ధ్రువీకరించారు. 

ప్రభుత్వ ఆదేశాలతో జిమ్‌ క్లిఫోర్డ్‌కు సీఐడీ తరఫున లేఖ రాశాం. మా లేఖకు సమాధానం కూడా వచ్చింది. తామిచ్చిన రిపోర్టు కూడా అసలైంది కాదని ఈ-మెయిల్‌ ద్వారా తెలిపారు. తనిఖీ చేస్తేనే అసలైనదా? మార్ఫింగ్‌ చేశారా? అనేది చెప్పగలం. జిల్లా ఎస్పీ ఫకీరప్ప కూడా అదే చెప్పారు. ఒరిజినల్‌ వీడియో క్లిప్‌ లేకుండా ఎలా తనిఖీ చేయగలం? నిపుణుల రిపోర్టులో మార్పులు చేస్తే ప్రామాణికత ఎక్కడుంది? ఫేక్‌ లెటర్లు ప్రచారం చేసిన వారిపై ఐటీ చట్టం 67 ప్రకారం కేసులు పెడతాం’’ అని సునీల్‌కుమార్ చెప్పారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts